సోమవారం 06 ఏప్రిల్ 2020
International - Jan 31, 2020 , 00:47:04

న్యూజిలాండ్‌ అగ్నిపర్వత పేలుడులో ఇండో-అమెరికన్‌ దంపతులు మృతి

న్యూజిలాండ్‌ అగ్నిపర్వత పేలుడులో ఇండో-అమెరికన్‌ దంపతులు మృతి

వెల్లింగ్టన్‌: న్యూజిలాండ్‌లోని వైట్‌ ఐలాండ్‌లో ఇటీవల జరిగిన అగ్నిపర్వత విస్ఫోటనం భారతీయ-అమెరికన్‌ వ్యాపారవేత్త ప్రతాప్‌ సింగ్‌ కుటుంబంలో పెను విషాదాన్ని నింపింది. గత నెల 9న ఈ అగ్నిపర్వతం పేలడంతో గాయపడిన ప్రతాప్‌ సింగ్‌ ఆక్లాండ్‌లోని మిడిల్‌మోర్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఈ వారం మృతిచెందినట్టు న్యూజిలాండ్‌ పోలీసులు ధ్రువీకరించారు. ఇదే ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఆయన భార్య మయుయారీ కూడా గత నెల 22న మరణించడంతో వారి ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. న్యూజిలాండ్‌లోని స్టోన్‌ మౌంటెయిన్‌ లో నివసించే ప్రతాప్‌ సింగ్‌ కుటుంబం గత నెల రాయల్‌ కరీబియన్‌ క్రూయిజ్‌షిప్‌లో విహారయాత్రకెళ్లినప్పుడు ఆ అగ్నిపర్వ తం బద్ధలైంది. ఆ సమయంలో ప్రతాప్‌ సింగ్‌ ముగ్గురు పిల్లలు, మయుయారీ తల్లి కూడా అదే నౌకలో ఉన్నా వారికి గాయాలేమీ కాలేదని అట్లాంటాకు చెందిన డబ్ల్యూఎస్‌బీటీవీ వెల్లడించింది.


logo