మంగళవారం 07 ఏప్రిల్ 2020
International - Feb 26, 2020 , 18:47:04

ఇండియా గొప్ప దేశం.. ట్రిప్ స‌క్సెస్ అయ్యింది

ఇండియా గొప్ప దేశం.. ట్రిప్ స‌క్సెస్ అయ్యింది

హైద‌రాబాద్‌:  ఇండియా ప‌ర్య‌ట‌న స‌క్సెస్‌ఫుల్‌గా సాగింద‌ని అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్వీట్ చేశారు.  కొద్దిసేప‌టి క్రిత‌మే ల్యాండ్ అయిన‌ట్లు ఆయ‌న తెలిపారు.  ఇండియా గొప్ప దేశ‌మ‌న్నారు.  వైట్‌హౌజ్‌కు వెళ్తున్నాన‌ని, అక్క‌డ అన్ని మీటింగ్‌ల‌కు హాజ‌రుకానున్న‌ట్లు ట్రంప్ త‌న ట్వీట్‌లో చెప్పారు.  ఇవాంకా ట్రంప్ కూడా తాజాగా ఓ ట్వీట్ చేసింది.  త‌న భ‌ర్త కుష్న‌ర్‌తో తాజ్‌మ‌హ‌ల్ వ‌ద్ద దిగిన ఫోటోను ట్వీట్ చేస్తూ.. థ్యాంక్యూ ఇండియా అని క్యాప్ష‌న్ ఇచ్చింది.  ఈనెల 24, 25 తేదీల్లో డోనాల్డ్ ట్రంప్ త‌న ఫ్యామిలీతో క‌లిసి భార‌త్‌లో ప‌ర్య‌టించిన విష‌యం తెలిసిందే.  అహ్మ‌దాబాద్‌లో మొతేరా స్టేడియాన్ని ఆయ‌న ప్రారంభించారు. అక్క‌డే ఉన్న స‌బ‌ర్మ‌తి ఆశ్ర‌మాన్ని కూడా ఆయ‌న విజిట్ చేశారు. ఆ త‌ర్వాత ఆగ్రా వెళ్లి.. అక్క‌డ తాజ్‌ను సంద‌ర్శించారు. మ‌రుస‌టి రోజు ఢిల్లీలో ప‌లు వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకున్నారు.logo