మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Sep 16, 2020 , 09:14:11

పాక్ త‌ప్పుడు మ్యాప్‌.. ఇండియా వాకౌట్‌

పాక్ త‌ప్పుడు మ్యాప్‌.. ఇండియా వాకౌట్‌

హైద‌రాబాద్‌: పాకిస్థాన్ త‌న సంకుచిత బుద్ధిని ప్ర‌ద‌ర్శించింది. ర‌ష్యా రాజ‌ధాని మాస్కోలో షాంఘై కోఆపరేష‌న్ ఆర్గ‌నైజేష‌న్‌(ఎస్‌సీవో) స‌మావేశాల్లో భాగంగా జ‌రిగిన జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారుల భేటీలో పాకిస్థాన్ త‌ప్పుడు మ్యాప్‌ను ప్ర‌ద‌ర్శించింది.  భార‌త్‌కు చెందిన క‌శ్మీర్ ప్రాంతాల‌తో కూడిన మ్యాప్‌ను పాకిస్థాన్ ఆ భేటీలో చూపించింది. దీన్ని ఖండించిన జాతీయ భ‌ద్ర‌తా స‌ల‌హాదారు అజిత్ దోవ‌ల్ ఆ స‌మావేశం నుంచి వాకౌట్ చేశారు. స‌మావేశానికి ఆతిథ్యం ఇస్తున్న‌వారి ఆంక్ష‌ల‌ను పాకిస్థాన్ ఉల్లంఘించింద‌ని, పాక్ వ్య‌వ‌హార శైలిని ఖండిస్తూ భార‌త్ ఆ స‌మావేశం నుంచి వాకౌట్ చేసిన‌ట్లు విదేశాంగ‌శాఖ ప్ర‌తినిధి అనురాగ్ శ్రీవాత్స‌వ్ తెలిపారు. ఎస్‌సీవో చార్ట‌ర్‌ను పాకిస్థాన్ దారుణంగా ఉల్లంఘించిన‌ట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. భార‌త్ త‌న అభ్యంత‌రాన్ని గ‌ట్టిగా వినిపించింద‌ని, పాకిస్థాన్‌ను మ్యాప్ చూపించ‌కుండా ఉండేదుకు ర‌ష్యా కూడా తీవ్రంగా ప్ర‌య‌త్నించిన‌ట్లు భార‌త వ‌ర్గాలు పేర్కొన్నాయి. పాకిస్థాన్ వైఖ‌రికి ర‌ష్యా మ‌ద్ద‌తు ఇవ్వ‌డం లేద‌ని ఆ దేశ జాతీయ భ‌ద్ర‌తా మండ‌లి కార్య‌ద‌ర్శి నికొలాయి ప‌త్రుషేవ్ తెలిపారు. పాక్ రెచ్చ‌గొట్టే చ‌ర్య‌ల‌తో ఎస్‌సీవోలో భార‌త్ పాత్ర‌కు ఎటువంటి ప్ర‌మాదం ఉండ‌ద‌న్నారు. పాక్ చూపింని మ్యాప్‌లో జ‌మ్మూక‌శ్మీర్‌, ల‌డాఖ్‌లోని భాగాల‌తో పాటు గుజ‌రాత్‌లోని జునాగ‌డ్ ప్రాంతాలు కూడా ఉన్నాయి.


 

 logo