మంగళవారం 11 ఆగస్టు 2020
International - Jul 02, 2020 , 17:42:21

౩౩ యుద్ధవిమానాలు కొనుగోలు చేయనున్న భారత్‌

౩౩ యుద్ధవిమానాలు కొనుగోలు చేయనున్న భారత్‌

న్యూఢిల్లీ : భారత్-చైనాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో వాయు శక్తిని మరింత పెంచడంపై భారత ప్రభుత్వం దృష్టిసారించింది. రష్యా నుంచి 33 కొత్త యుద్ధ విమానాలు, 12 సుఖోయ్ 30 ఎంకేఐ యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దీంతో వైమానిక దళం, నావికాదళం కోసం 248 ఎయిర్ టైమ్ ఎయిర్ క్షిపణులను కొనుగోలు చేయడానికి అనుమతి లభించింది. ఇదే సమయంలో ఇప్పటికే వైమానిక దళంతో ఉన్న 59 మిగ్-29 లు అప్‌గ్రేడ్ అవుతాయి. దీనితోపాటు 1000 కిలోమీటర్ల పరిధితో డీఆర్డీవో యొక్క ల్యాండ్ అటాచ్ క్రూయిజ్ క్షిపణిని కొనుగోలు చేయడానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ ఆయుధాలన్నింటికి రూ.18,148 కోట్ల నిధులు వ్యయం కానున్నాయి.

ఇరు దేశాల రక్షణ ఒప్పందాలు, రెండో ప్రపంచ యుద్ధంలో విజయం సాధించిన 75 వ వార్షికోత్సవ వేడుకలు, రాజ్యాంగ సవరణ తీసుకురావడంపై ప్రధాని నరేంద్ర మోదీ గురువారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అన్ని రంగాలలో ఇరు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలన్న నిబద్ధతను రెండు దేశాల నేతలు పునరుద్ఘాటించారు.

లడఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్‌- చైనా మధ్య ఘర్షణ జరిగిన అనంతరం భారత్‌ తన సైనిక దళాలను నిరంతరం పెంచడంపై దృష్టిసారించింది. ఇటీవల రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కూడా రష్యాలో మూడు రోజులపాటు పర్యటించారు. రాఫెల్‌ యుద్ధ విమానాలను త్వరగా అందజేసేలా చర్యలు తీసుకోవాలని రష్యా అధికారులను రాజ్‌నాథ్‌ కోరినట్లు సమాచారం.


logo