ఆదివారం 24 మే 2020
International - Jan 08, 2020 , 12:13:38

భారత పౌరులు అప్రమత్తంగా ఉండండి: కేంద్రం

భారత పౌరులు అప్రమత్తంగా ఉండండి: కేంద్రం

న్యూఢిల్లీ: గల్ఫ్‌ దేశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా భారత విమానయాన శాఖ అప్రమత్తమైంది. ఇరాక్‌, ఇరాన్‌తో పాటు గల్ఫ్‌ పరిధిలోని గగనతలంలోకి వెళ్లొద్దని భారత విమానయాన సంస్థలకు కేంద్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇరాక్‌ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాలని భారతీయులకు కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఇరాక్‌లో పరిస్థితుల దృష్ట్యా ఇరాక్‌ ప్రయాణానికి దూరంగా ఉండాలని పేర్కొంది. ఇరాక్‌లో ఉన్న భారతీయులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని కోరింది.

తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఇరాక్‌లో నివసిస్తున్న భారతీయ పౌరులు స్థానికంగా ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించింది. ప్రయాణాలన్నీ వాయిదా వేసుకోవాలని భారత పౌరులకు విదేశాంగశాఖ సూచించింది. ఇరాక్‌లోని అమెరికా బేస్‌ క్యాంపులపై ఇరాన్‌ బాలిస్టిక్‌ క్షిపణులతో విరుచుకుపడిన నేపథ్యంలో భారత విదేశాంగ శాఖ గల్ఫ్‌లోని భారతీయులకు హెచ్చరికలు జారీ చేసింది. గల్ఫ్‌, ఇరాన్‌, ఇరాక్‌ల మీదుగా ఎయిర్‌స్పేస్‌లను వాడకూడదని అమెరికా ఇప్పటికే నిషేధం విధించింది.


logo