బుధవారం 01 ఏప్రిల్ 2020
International - Jan 30, 2020 , 02:01:02

అసమానతల తొలిగింపులో డిజిటల్‌ పరిజ్ఞానం

అసమానతల తొలిగింపులో  డిజిటల్‌ పరిజ్ఞానం
  • భారత్‌ విజయవంతంగా ఉపయోగించిందన్న ఐరాస

ఐరాస: ప్రజల మధ్య అసమానతలను తగ్గించేందుకు డిజిటల్‌ పరిజ్ఞానాన్ని భారత్‌ విజయవంతంగా వినియోగించిందని ఐక్యరాజ్యసమితి (ఐరాస) పేర్కొంది. అసమానతలను తగ్గించేందుకు ఆధార్‌ గుర్తింపు ప్రక్రియను మొబైల్‌ టెక్నాలజీతో అనుసంధానం చేసిన భారత్‌ అనుభవం భవిష్యత్తులో ఇతర దేశాలకు ఉపయోగపడగలదని తెలిపింది. ఐక్యరాజ్యసమితి ఆర్థిక, సామాజిక వ్యవహారాల (డీఈఎస్‌ఏ) విభాగం ప్రచురించిన ‘ప్రపంచ సామాజిక నివేదిక 2020’ని బుధవారం విడుదల చేశారు. భారత్‌లో ఆర్థిక సమ్మిళిత్వాన్ని సాధించడంలో ఆధార్‌ వ్యవస్థ పోషించిన పాత్రను ఆ నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. ‘బయోమెట్రిక్‌ ఆధార్‌తో లింగ భేదాలు, ఆదాయం, విద్య ఆధారిత వ్యత్యాసాలు తగ్గిపోయాయి. ఆరోగ్యం, ఎన్నికల నిర్వహణ వంటి కార్యక్రమాలు మెరుగుపడ్డాయి. ఆధార్‌ కార్డులకు ముందు చాలామంది పేదలు బ్యాంక్‌ ఖాతా తెరువడానికి వారికి ఒక అధికారిక గుర్తింపు కార్డు లేదు. 2011లో బ్యాంక్‌ ఖాతాలేనివారు 55.7 కోట్ల మంది ఉండగా, 2015 నాటికి అది 23.3 కోట్లకు తగ్గింది. అయితే పలు బ్యాంక్‌ ఖాతాల్లో ఎలాంటి లావాదేవీలు జరుగడం లేదు’ అని పేర్కొంది.


logo
>>>>>>