చైనా మైండ్ గేమ్స్.. భారత్ జాగ్రత్తలు..

న్యూఢిల్లీ : శీతాకాలంలో వివాదాలకు అవకాశాలు తక్కువగా ఉంటాయని చైనా ప్రభుత్వం భావించినందున "భారతదేశంతో వివాదాస్పద సరిహద్దు" నుంచి తన 10 వేల మంది సైనికులను చైనా ఉపసంహరించుకున్నది. ఈ విషయాన్ని హాంకాంగ్‌కు చెందిన ఒక ఆంగ్ల వార్తాపత్రిక చైనా సైనిక వర్గాలను ఉటంకిస్తూ వార్తకథనం ప్రచురించింది. ఈ వార్తా కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. భారత సైనికులు చూసేందుకు, ధ్రువీకరించేందుకు వీలుగా సరిహద్దుల్లోని తమ సైనికులను చైనా వెనక్కి రప్పించుకున్నది. దక్షిణ చైనా మార్నింగ్ పోస్ట్ నివేదిక ప్రకారం, జిన్జియాంగ్, టిబెట్ సైనిక ప్రాంతాలలోని యూనిట్ల నుంచి తాత్కాలికంగా మోహరించిన దళాలను ఉపసంహరించుకున్నది.
విశాలమైన టిబెటన్ పీఠభూమి నుంచి 1000 కిలోమీటర్ల నుంచి 500 కిలోమీటర్ల వరకు పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) శిక్షణా యూనిట్లను ఉపసంహరించుకున్నట్లు భారత సైన్యం ధ్రువీకరించింది. అయితే, 2020 మే 5 న రెండు దేశాల సైన్యాలు ముఖాముఖి తలపడిన అనంతరం తూర్పు లడఖ్‌లోని పాయింట్ల నుంచి తమ సైన్యాన్ని ఉపసంరించేది లేదని పీఎల్ఏ పేర్కొన్నది. చైనా వార్తాపత్రిక వాదనలను స్వతంత్రంగా ధ్రువీకరించడానికి మార్గం లేకపోయినప్పటికీ, 10 వేల మంది సైనికుల కదలికలు ఉపగ్రహ చిత్రాల ద్వారా లేదా కమ్యూనికేషన్ అంతరాయాల ద్వారా తప్పించుకుపోదు. దళాలను వాహనాల ద్వారా ఉపసంహరించుకోవాలి. లేదా రవాణా విమానాల ద్వారా తిరిగి వారి బ్యారక్లకు పంపవలసి ఉంటుంది. 3,488 కిలోమీటర్ల లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ (ఎల్ఏసీ) వెంట చివరి పోస్టుకు లోహపు రహదారులు, అధునాతన ల్యాండింగ్ మైదానాలతో పూర్తిగా అమలు చేయగల సామర్థ్యం ఉన్నది. జాతీయ భద్రతా ప్రణాళికల ప్రకారం, తూర్పు లడఖ్ ఎల్ఏసీలో పీఎల్ఏ యథాతథ స్థితిని పునరుద్ధరించని సమయం వరకు.. భారత సైన్యం అప్రమత్తంగా ఉంటుంది. గమనించదగ్గ విషయం ఏమిటంటే, కరాకోరం పాస్ నుంచి 94 కిలోమీటర్ల దూరంలో ఉన్న జైదుల్లా లేదా షాహిదుల్లా గారిసన్ వద్ద పీఎల్ఏ వార్షిక వ్యాయామాలు నిర్వహిస్తుంది. ఈ పాస్ కేవలం దౌలత్ బేగ్ ఓల్డి నుంచి రాతి విసిరేంత దూరంలో ఉంటుంది. 19 వ శతాబ్దంలో డోగ్రా జనరల్ జోరావర్ సింగ్ ఈ వ్యూహాత్మకంగా ఉన్న పట్టణం వరకు అన్ని ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నారు. వీటిని సంషిలి బ్యారక్స్ అని పిలుస్తారు. లడఖ్, తారిమ్ బేసిన్ మధ్య కారవాన్ మార్గంలో ఉన్న జైదుల్లా 2018 మినహా ఏటా పీఎల్ఏ శిక్షణా వ్యాయామాలు నిర్వహిస్తున్నది.
సైన్యాన్ని ఉపసంహరించుకున్నట్లు అల్లిన కథలను భారత్ అసలే పట్టించుకోలేదు. వారిని సమర్థంగా ఎదుర్కొనేందుకు తగినంత ప్రణాళికలు సిద్ధం చేసుకున్నది. ఫ్రాన్స్ నుంచి తెప్పించిన రాఫెల్ జెట్ ఫైటర్లను సరిహద్దులోని వైమానికదళ పాయింట్లలో మోహరించింది. చైనా ఆడుతున్న మైండ్ గేమ్‌ను నిశితంగా పరిశీలిస్తున్న భారత్.. అందుకు తగినట్లుగా జాగ్రత్తలు తీసుకుంటూ సరిహద్దు కాపలాపై దృష్టిసారించింది.
తాజావార్తలు
- డయాగ్నొస్టిక్ సెంటర్లలో ఈసీజీ, అల్ట్రాసౌండ్: మంత్రి ఈటల
- భారీ మల్టీ స్టారర్‌కు ప్లాన్ చేస్తున్న శంకర్..!
- పట్టణ పేదలకు మెరుగైన వైద్య సేవలు : మంత్రి కేటీఆర్
- కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం ప్రారంభం
- పోలీస్ అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ అందిస్తా : మంత్రి హరీశ్‌రావు
- సగం ఉడికిన గుడ్లు తినకండి..
- మావాడు లెజెండ్ అవుతాడు: సుందర్ తండ్రి
- 'తాండవ్' వెబ్ సిరీస్‌కు వ్యతిరేకంగా గాడిదలతో నిరసన
- కాషాయ దుస్తులలో పవన్ కళ్యాణ్.. వైరల్‌గా మారిన ఫొటోలు
- మంత్రిపై లైంగిక దాడి ఆరోపణలు.. ఫిర్యాదు వెనక్కి తీసుకున్న మహిళ