ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Aug 12, 2020 , 08:16:51

లెబనాన్‌కు భారత్‌ మరింత సాయం

లెబనాన్‌కు భారత్‌ మరింత సాయం

జెనీవా: ఇటీవల భారీ పేలుళ్లతో దెబ్బతిన్న లెబనాన్‌కు ఔషధాలు, ఆహార పదార్థాలతోపాటు మరింత సహాయ సామగ్రి పంపుతున్నట్లు ఐక్యరాజ్యసమితిలో భారత్‌ శాశ్వత ప్రతినిధి టీఎస్‌ తిరుమూర్తి చెప్పారు. లెబనాన్‌ రాజధాని బీరూట్‌లో భయంకర మానవ విషాదం చోటు చేసుకున్నదన్నారు. బాధితులు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు. ఇటీవలే కరోనాపై పోరు కోసం లెబనాన్‌కు భారత్‌ అత్యవసర వైద్య సామగ్రిని కూడా పంపిందని తెలిపారు.

గ‌త‌వారం బీరుట్‌లోని పోర్టులో జ‌రిగిన భారీ అగ్నిప్ర‌మాదంలో 150 మందికిపైగా మ‌ర‌ణించారు. వేల‌సంఖ్య‌లో ప్ర‌జ‌లు గాయ‌ప‌డ్డారు. ‌


logo