బుధవారం 20 జనవరి 2021
International - Dec 22, 2020 , 17:22:32

యూఎస్‌లో 24 గంట‌ల్లో 4 ల‌క్ష‌ల కొత్త కేసులు

యూఎస్‌లో 24 గంట‌ల్లో 4 ల‌క్ష‌ల కొత్త కేసులు

న్యూఢిల్లీ : బ్రిటన్‌లో కొవిడ్‌ కొత్త ఉత్పరివర్తనం చెంద‌డంతో.. 70% వేగంగా క‌రోనా వైర‌స్ వ్యాపిస్తోంది. ఈ నేప‌థ్యంలో అన్ని దేశాలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని డబ్ల్యూహెచ్‌వో హెచ్చ‌రించింది. ఆ దేశం నుంచి వ‌చ్చే విమానాల‌పై ఆయా దేశాలు నిషేధం విధించాయి. 

అయితే యూఎస్‌లో గ‌డిచిన 24 గంట‌ల్లో కొత్త‌గా 4 ల‌క్ష‌ల క‌రోనా కేసులు న‌మోదైన‌ట్లు కేంద్ర ఆరోగ్య కార్య‌ద‌ర్శి రాజేశ్ భూష‌ణ్ వెల్ల‌డించారు. ఒక్క రోజులోనే బ్రెజిల్‌లో 70 వేల కేసులు ర‌ష్యాలో 28 వేల కేసులు, జ‌ర్మ‌నీలో 33 వేల కేసులు న‌మోదైన‌ట్లు తెలిపారు. యూకేలోనూ 36 వేలు కేసులు న‌మోదు కావ‌డంతో తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు స్థానికులు. ఈ క్ర‌మంలో భార‌త్‌లో కొవిడ్ కొత్త కేసుల‌ను అరిక‌ట్టేందుకు చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు భూష‌ణ్ పేర్కొన్నారు.  

దేశంలో ప్ర‌తి మిలియ‌న్ జ‌నాభాకు 7,300 కేసులు న‌మోదైతే, ప్ర‌పంచ వ్యాప్తంగా ఆ స‌గ‌టు 9,697గా ఉంది. ప్ర‌తి మిలియ‌న్ జ‌నాభాకు మ‌ర‌ణాల సంఖ్య 106గా ఉంటే.. ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆ స‌గ‌టు 216గా ఉన్న‌ట్లు పేర్కొన్నారు. గ‌త వారం రోజుల్లో ఇండియాలో మిలియ‌న్ జ‌నాభాకు కొత్త‌గా 124 కేసులు న‌మోదు కాగా, ప్ర‌పంచ వ్యాప్తంగా ఆ సంఖ్య 588గా ఉంది.  

ఇవి కూడా చ‌ద‌వండి..

ఆ కొత్త ర‌కం క‌రోనాతో మ‌న‌కు ముప్పేం లేదు: కేంద్రం

వైవాహిక జీవితంలో సమస్యలా? ఇది చదవండి..!
గర్భిణుల‌కు క‌రోనా వ్యాక్సిన్ ఇస్తారా? ఇవ్వరా?logo