ఆదివారం 27 సెప్టెంబర్ 2020
International - Aug 05, 2020 , 17:35:09

జమ్ముకశ్మీర్‌ ప్రత్యేక హోదా రద్దు, విభజన చట్టవిరుద్ధం: చైనా

జమ్ముకశ్మీర్‌ ప్రత్యేక హోదా రద్దు, విభజన చట్టవిరుద్ధం: చైనా

బీజింగ్‌: జమ్ముకశ్మీర్‌ ప్రత్యేక హోదా రద్దు, ఆ రాష్ట్ర విభజన చట్టవిరుద్ధమని చైనా తెలిపింది. భారత్‌ ఏకపక్షంగా చేసిన ఈ మార్పులు చెల్లవని పేర్కొంది. జమ్ముకశ్మీర్‌లోని పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్లు చైనా విదేశాంగ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ బుధవారం తెలిపారు. జమ్ముకశ్మీర్‌ అంశం భారత్‌, పాకిస్థాన్‌ మధ్య మిగిలిన చారిత్రిక వివాదం అని ఆయన అన్నారు. యుఎన్ చార్టర్, యుఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ తీర్మానాలు, భార‌త్‌-పాకిస్థాన్‌ మధ్య ద్వైపాక్షిక ఒప్పందాల మేరకు నిర్దేశించిన ఒక  వాస్తవిక వాస్తవం ఇది అని వాంగ్‌ చెప్పారు. ఈ నేపథ్యంలో గత ఏడాది ఆగస్టు 5న జమ్ముకశ్మీర్‌ యథాతథ స్థితిపై భారత్‌  ఏకపక్షంగా చేసిన మార్పులు చట్టవిరుద్ధమని అవి చెల్లబోవని ఆయన తెలిపారు.

గత ఏడాది ఆగస్టు 5న జమ్ముకశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతోపాటు ఆ రాష్ట్రాన్ని జమ్ముకశ్మీర్‌, లడఖ్‌ కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించింది. ఇది జరిగి బుధవారానికి ఏడాదైన సందర్భంగా చైనా ఈ మేరకు వ్యాఖ్యానించింది. కశ్మీర్‌ అంశాన్ని భారత్‌, పాకిస్థాన్‌ చర్చలు, సంప్రదింపుల ద్వారా శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించింది. logo