గురువారం 04 జూన్ 2020
International - Apr 28, 2020 , 02:06:44

రక్షణ వ్యయం రయ్‌!

రక్షణ వ్యయం రయ్‌!

  • సైనిక వ్యయంలో టాప్‌-3 దేశాల్లో భారత్‌

లండన్‌: ప్రపంచ దేశాల్లో అమెరికా, చైనా తర్వాత ఇండియానే అత్యధికంగా మిలిటరీపై వెచ్చిస్తున్నదని తాజా నివేదిక వెల్లడించింది. ఈ విషయంలో భారత్‌, చైనా టాప్‌-3లో నిలువడం ఇదే తొలిసారి అని ‘స్టామ్‌హోమ్‌ ఇంటర్నేషనల్‌ పీస్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ (సిప్రి)’ తెలిపింది. రష్యా, సౌదీఅరేబియా నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచాయని పేర్కొంది. 2019 ఏడాదికిగానూ ప్రపంచ దేశాల సైనిక వ్యయాలపై సిప్రి సోమవారం ఒక నివేదికను విడుదల చేసింది. గతేడాది భారత్‌ రక్షణ వ్యయం 6.8 శాతం పెరిగి 71.1 బిలియన్‌ డాలర్లకు (రూ.5.42 లక్షల కోట్లు) చేరుకున్నదని ఆ నివేదిక వెల్లడించింది. గత మూడు దశాబ్దాల్లో (1990-2019) భారత్‌ రక్షణ వ్యయం 259 శాతం పెరిగింది. కాగా, మిలిటరీపై ప్రపంచదేశాలు గతేడాది మొత్తం 1,917 బిలియన్‌ డాలర్లు వెచ్చించాయి. అమెరికా ఏకంగా 732 బిలియన్‌ డాలర్లను (రూ.55.80 లక్షల కోట్లు) ఖర్చుచేస్తున్నది. ప్రపంచ రక్షణ వ్యయంలో ఇది 38 శాతం కావడం విశేషం.logo