గురువారం 28 మే 2020
International - May 07, 2020 , 22:02:48

భారత్‌, పాకిస్థాన్‌కే వైరస్‌ ముప్పు ఎక్కువ: వోఎన్‌ఎస్‌

భారత్‌, పాకిస్థాన్‌కే వైరస్‌ ముప్పు ఎక్కువ: వోఎన్‌ఎస్‌

లండన్‌: పాశ్చాత్య దేశాల్లోని శ్వేత జాతీయులతో పోలిస్తే భారత్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ వంటి దేశాల్లోని ప్రజలకు, నల్లజాతీయులకే కొవిడ్‌-19 కారణంగా  ఎక్కువగా మరణించే అవకాశాలు ఉన్నాయిని బ్రిటిష్‌ గణాంకాల కార్యాలయం (వోఎన్‌ఎస్‌) అంచనావేసింది. వేర్వేరు జాతి సమూహాలపై వైరస్‌ ప్రభావం వేర్వేరుగా ఉన్నట్టు వెల్లడించింది. ఆర్థిక, సామాజిక పరిస్థితులు, విద్య, ఆరోగ్యం తదితర అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ  మోడల్స్‌ రూపొందించినట్లు పేర్కొన్నది. వివిధ వయస్సుల ప్రజలు, జాతులపై వైరస్‌ ముప్పు వేర్వేరుగా ఉన్నదని వివరించింది. తెల్లజాతి పురుషులతో పోలిస్తే నల్లజాతీయుల్లో 4.2 రెట్లు ఎక్కువగా వైరస్‌ కారణంగా మరణించవచ్చని, అలాగే తెల్లజాతి మహిళలతో పోలిస్తే నల్లజాతి మహిళలు 4.3 రెట్లు అధికంగా  వైరస్‌కారణంగా చనిపోయి వుండవచ్చని  పేర్కొన్నది. వైరస్‌ను కట్టడి  చేసే వ్యాక్సిన్‌ అభివృద్ధిలో జన్యుక్రమాల  అధ్యయనం  కీలకపాత్ర పోషించవచ్చునని అభిప్రాయపడింది.


logo