గురువారం 28 మే 2020
International - Apr 28, 2020 , 10:55:23

మిలిట‌రీ వ్య‌యంలో మ‌న‌ది మూడోస్థానం

మిలిట‌రీ వ్య‌యంలో మ‌న‌ది మూడోస్థానం

ప్ర‌పంచంలో ర‌క్ష‌ణ వ్య‌యం అత్య‌ధికంగా చేస్తున్న దేశాల్లో మొట్ట‌మొద‌టిసారి భార‌త్ మూడోస్థానానికి చేరుకుంది. అమెరికా, చైనా త‌ర్వాత భార‌త్ నిలిచింది. అయితే మొద‌టి రెండు దేశాల‌తో పోల్చుకుంటే ఖ‌ర్చులో భార‌త్ చాలా వెనుక‌బ‌డే ఉంది. భార‌త్‌కంటే అమెరికా ర‌క్ష‌ణ వ్య‌యం ప‌దిరెట్లు, చైనా వ్య‌యం నాలుగురెట్లు ఉంద‌ని స్టాక్‌హోం ఇంట‌ర్నేష‌న‌ల్ పీస్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (సిప్రి) తెలిపింది. 2019లో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ర‌క్ష‌ణ‌వ్య‌యం 3.6శాతం పెరిగింద‌ని పేర్కొంది. 

ఇక దేశాల‌వారీగా చూస్తే అమెరికా ర‌క్ష‌ణ వ్య‌యం 732 బిలియ‌న్ డాల‌ర్లు, చైనా 261 బిలియ‌న్ డాల‌ర్లు, ఇండియా 71.1 బిలియ‌న్ డాల‌ర్లు, ర‌ష్యా 65.1 బిలియ‌న్ డాల‌ర్లు, సౌదీ అరేబియా 61.9 బిలియ‌న్ డాల‌ర్లుగా ఉంది. మిలిట‌రీ వ్య‌యంలో మొద‌టి మూడు దేశాల్లో రెండు ఆసియా దేశాలే ఉండ‌టం ఇదే మొద‌టిసారి. అయితే భార‌త ర‌క్ష‌ణ వ్య‌యంలో ఎక్కువ మొత్తం జీతాలు, పెన్ష‌న్ల‌కే పోతున్న‌ది. 2020-21 వార్షిక బ‌డ్జెట్‌లో ర‌క్ష‌ణ‌రంగానికి 62 బిలియ‌న్ డాల‌ర్లు కేటాయించ‌గా అందులో 18 బిలియ‌న్ డాల‌ర్లు జీతాలు, పెన్ష‌న్ల‌కే పోతున్నాయి. 


logo