శనివారం 11 జూలై 2020
International - Jun 20, 2020 , 07:16:55

భద్రతామండలికి భారత్‌ సారథ్యం!

భద్రతామండలికి భారత్‌ సారథ్యం!

జెనీవా: ఐక్యరాజ్యసమితి (ఐరాస) భద్రతామండలిలో సాధారణ సభ్యదేశంగా ఎన్నికైన భారత్‌ వచ్చే ఏడాది ఆగస్టులో భద్రతా మండలి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించనున్నది. నెలకోసారి భద్రతామండలికి ఇంగ్లిష్‌ అక్షరమాల ప్రకారం సభ్య దేశాలు అధ్యక్షత వహిస్తాయి. తిరిగి 2022లోనూ అదే నెలలో మండలికి భారత్‌ సారథ్యం వహిస్తుందని ఐరాస అధికార ప్రతినిధి తెలిపారు.

వచ్చే ఏడాది జనవరి ఒకటో తేదీ నుంచి రెండేండ్ల పాటు కొనసాగే.. ఐరాస భద్రతామండలి సాధారణ సభ్యత్వం కోసం జరిగిన ఎన్నికల్లో భారత్‌తోపాటు నార్వే, ఐర్లాండ్‌, మెక్సికో, కెన్యా ఎన్నికైన విషయం తెలిసిందే.


logo