బుధవారం 03 జూన్ 2020
International - May 18, 2020 , 10:34:40

డ‌బ్ల్యూహెచ్‌వోపై ద‌ర్యాప్తు.. ముసాయిదాకు భార‌త్ మ‌ద్ద‌తు

డ‌బ్ల్యూహెచ్‌వోపై ద‌ర్యాప్తు.. ముసాయిదాకు భార‌త్ మ‌ద్ద‌తు

హైద‌రాబాద్‌:  క‌రోనా వైర‌స్ నియంత్ర‌ణ విష‌యంలో ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ స‌రిగా వ్య‌వ‌హ‌రించ‌లేద‌ని అమెరికా ఆరోపిస్తున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో డ‌బ్ల్యూహెచ్‌వోపై ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని ప్ర‌పంచ దేశాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్ప‌టికే 62 దేశాలు ఓ ముసాయిదాను త‌యారు చేశాయి. ఇవాళ ప్రారంభం అయ్యే 73వ డ‌బ్ల్యూహెచ్‌వో వార్షిక స‌మావేశాల్లో .. ఆరోగ్య సంస్థ పాత్ర‌ను ప్ర‌శ్నించ‌నున్నారు. భార‌త్ కూడా ఆ కూట‌మి దేశాల డిమాండ్‌కు మ‌ద్ద‌తు ఇస్తున్న‌ది.  డ‌బ్ల్యూహెచ్‌వో పై నిష్ప‌క్ష‌పాతంగా, వ్య‌క్తిగ‌తంగా ద‌ర్యాప్తు చేప‌ట్టాల‌ని ఆస్ట్రేలియా, యురోపియ‌న్ యూనియ‌న్ డిమాండ్ చేసింది.  ఈ దేశాల‌కు భార‌త్ కూడా మ‌ద్ద‌తుగా నిలిచింది. 

క్ర‌మ‌ప‌ద్ధ‌తిలో నిష్ప‌క్ష‌పాతంగా, వ్య‌క్తిగ‌తంగా, స‌మ‌గ్రంగా, ప్ర‌స్తుతం ఉన్న విధానాల‌కు అనుకూలంగా క‌రోనా మ‌హ‌మ్మారి అంశంలో డ‌బ్ల్యూహెచ్‌వో పాత్ర‌పై విచార‌ణ చేప‌ట్టాల‌ని ముసాయిదాలో పేర్కొన్నారు.  డ‌బ్ల్యూహెచ్‌వోపై ఇండిపెండెంట్ ఎంక్వైరీ చేప‌ట్టాల‌ని గ‌త నెల‌లో తొలుత ఆస్ట్రేలియా డిమాండ్ చేసింది.  రాబోయే మ‌హ‌మ్మారుల‌ను అడ్డుకోవాలంటే డ‌బ్ల్యూహెచ్‌వోతో క‌లిసి ప‌నిచేయాల‌ని, కానీ దానికి ముందు ఆ సంస్థ పాత్ర‌పై ద‌ర్యాప్తు చేప‌ట్టాల్సి ఉంటుంద‌ని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి మారిసే పెయిన్ తెలిపారు.  కానీ 62 దేశాలు తయారు చేసిన ముసాయిదాలో ఎక్క‌డా చైనా పేరుగానీ, లేక వుహాన్ పేరుగానీ లేదు.  జ‌పాన్‌, బ్రిట‌న్‌, న్యూజిలాండ్‌, ద‌క్షిణ కొరియా, బ్రెజిల్‌, కెన‌డా దేశాలు కూడా ముసాయిదాకు మ‌ద్ద‌తు ఇస్తున్నాయి. 


logo