శుక్రవారం 05 జూన్ 2020
International - Apr 19, 2020 , 01:29:06

భారత్‌కు సెల్యూట్‌

భారత్‌కు సెల్యూట్‌

  • క్లిష్ట సమయంలో ఇతర దేశాలను ఆదుకుంటున్న ఇండియా: ఐరాస

ఐరాస, ఏప్రిల్‌ 18: కరోనా కారణంగా ప్రపంచమంతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నదని, ఈ క్లిష్ట సమయంలో ఒకరినొకరు ఆదుకోవాల్సిన అవసరం ఉన్నదని ఐక్యరాజ్యసమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటేరస్‌ తెలిపారు. ఒకరినొకరు ఆదుకుంటున్న దేశాలకు సెల్యూట్‌ చేస్తున్నానని చెప్పారు. కరోనా నివారణకు మలేరియా ఔషధం హైడ్రాక్సీ క్లోరోక్విన్‌ పనిచేస్తుందని పలువురు పేర్కొంటున్న నేపథ్యంలో ఇటీవల భారత్‌ దీనిని అమెరికాతో సహా పలు దేశాలకు అందజేసింది. ఇంకా కొన్ని దేశాలకు ఈ ఔషధాన్ని పంపనున్నది. ఈ నేపథ్యంలో గుటేరస్‌ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ‘ప్రస్తుత సంక్షోభ సమయంలో ఒకరికొకరు అండగా నిలువాల్సిన అవసరం ఉన్నది. ఎవరైతే సాయం చేయగల స్థితిలో ఉన్నారో వాళ్లు తప్పక సాయం చేయాలి. ఇప్పటికే ఇలాంటి సాయం చేస్తున్న భారత్‌, ఇతర దేశాలకు సెల్యూట్‌ చేస్తున్నా’ అని గుటేరస్‌ పేర్కొన్నారు.


logo