బుధవారం 08 జూలై 2020
International - May 29, 2020 , 16:27:04

భారత్‌లో ప్రతిరోజూ 100 మందికి పైగా మృతి

భారత్‌లో ప్రతిరోజూ 100 మందికి పైగా మృతి

న్యూఢిల్లీ: భారత్‌లో లాక్‌డౌన్‌ ఆంక్షలు సడలించడంతో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరిగింది.  కోవిడ్-19 కేసులు అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ తొమ్మిదో స్థానంలో ఉంది. శుక్రవారం వరకు భారత్‌లో 1,60,000 మందికి కరోనా సోకగా మహమ్మారి కారణంగా 4,600 మంది చనిపోయారు. 

దేశంలో మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి. దేశరాజధాని ఢిల్లీ, గుజరాత్‌ రాష్ట్రాలు తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.  మే 28న ఒకే రోజు 194 మంది కోవిడ్‌-19 వల్ల చనిపోయారు. మే 5 తర్వాత ఒక్క రోజే ఇంతస్థాయిలో మరణాలు నమోదవడం  గమనార్హం. మే 13 నుంచి ప్రతిరోజూ దేశంలో 100కు పైగా కరోనా మరణాలు సంభవిస్తున్నాయి.

భారత్‌లో మరణాల రేటు 2.9శాతంగా ఉన్నది. గడచిన 24 గంటల్లో కొత్తగా  7,466 పాజిటివ్‌ కేసులు నమోదవడంతో మొత్తం కేసుల సంఖ్య 1.65 లక్షలు దాటింది. ఇవాళ్టి వరకు 4,706 మంది కోవిడ్‌-19 వల్ల చనిపోయారు. భారత్‌ ఇప్పటికే కరోనా మరణాలు, కేసుల సంఖ్యలో చైనాను దాటేసింది.  


logo