సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Aug 09, 2020 , 12:36:13

నేపాల్‌కు వెంటిలేటర్లు అందజేసిన భారత్

నేపాల్‌కు వెంటిలేటర్లు అందజేసిన భారత్

కాఠ్మండు: పొరుగు దేశమైన నేపాల్‌కు భారత్ వెంటిలేటర్లను అందజేసింది. నేపాల్‌లోని భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా ఆ దేశ ఆర్మీ చీఫ్ జనరల్ పూర్ణ చంద్ర థాపాకు వీటిని అందజేశారు. నేపాల్ ఆర్మీ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. కరోనా నేపథ్యంలో సహాయం కింద నేపాల్‌కు పది వెంటిలేటర్లను భారత్ అందజేసింది. నేపాల్ ప్రధాని ఓలి శర్మ భారత్ పట్ల వ్యతిరేక వైఖరి ప్రదర్శిస్తున్నప్పటికీ పొరుగు దేశానికి భారత్ బాసటగా నిలుస్తున్నది. ఆత్మనిర్భర్ భారత్ కార్యక్రమంలో భాగంగా దేశంలో తయారు చేసిన వెంటిలేటర్లను నేపాల్‌కు అందజేసింది. నేపాల్‌లో కరోనా కేసుల సంఖ్య 22,500 దాటగా ఇప్పటి వరకు 73 మంది మరణించారు.

logo