శనివారం 05 డిసెంబర్ 2020
International - Oct 29, 2020 , 21:42:18

ప్రత్యేక నోట్‌పై తప్పుడు ప్రపంచపటం : సౌదీకి నిరసన తెలిపిన భారత్‌

ప్రత్యేక నోట్‌పై తప్పుడు ప్రపంచపటం : సౌదీకి నిరసన తెలిపిన భారత్‌

న్యూఢిల్లీ : జీ 20 దేశాల ప్రత్యేక సమావేశాల సందర్భంగా సౌదీ అరేబియా ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రత్యేక నోటుపై భారత్‌ ఆందోళన వ్యక్తం చేసింది. భారతదేశం యొక్క బాహ్య ప్రాదేశిక సరిహద్దులను తప్పుగా చిత్రీకరించడం పట్ల నిరసన తెలిపినట్లు భారత విదేశాంగ శాఖ గురువారం తెలిపింది.

రియాద్‌లో వచ్చే నెల 21,22 తేదీల్లో జరుగనున్న జీ 20 దేశాల ప్రత్యేక శిఖరాగ్ర సమావేశాలకు గుర్తుగా సౌదీ అరేబియా ప్రభుత్వం ప్రత్యేక కరెన్సీ నోటును తీసుకువచ్చింది. ఈ నోటును సౌదీ అరేబియా ద్రవ్య అథారిటీ ఈనెల 24 న విడుదల చేసింది. 20 రియాల్స్‌ విలువచేసే నోటుపై సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ ఫొటో ఉండగా.. రెండవ వైపున ప్రపంచపటం.. ఇందులో జీ-20 దేశాలను వేర్వేరు రంగుల్లో చూపించారు. కశ్మీర్ కాకుండా గిల్గిట్, బాల్టిస్తాన్లను పాకిస్తాన్లో భాగంగా వర్ణించలేదు. "సౌదీ అరేబియా అధికారిక, చట్టపరమైన నోటుపై భారతదేశం యొక్క బాహ్య ప్రాదేశిక సరిహద్దులను పూర్తిగా తప్పుగా చూపించారు. అందుకు న్యూఢిల్లీలోని ఆ దేశ రాయబారి ద్వారా తీవ్రమైన ఆందోళనను తెలియజేసాం. అత్యవసరంగా తీసుకున్నందుకు సౌదీ వైపు దిద్దుబాటు చర్యలు కోరారు" అని భారత విదేశాంగ శాఖ తెలిపింది. "జమ్ముకశ్మీర్, లడఖ్ కేంద్రపాలిత ప్రాంతాలు భారతదేశంలో అంతర్భాగమని పునరుద్ఘాటించాలనుకుంటున్నాం" అని మంత్రిత్వ శాఖ ప్రతినిధి చెప్పారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.