గురువారం 02 జూలై 2020
International - Jun 06, 2020 , 11:13:17

క‌రోనా ప‌రీక్ష‌లు చేప‌డితే, భార‌త్‌లో ఎక్కువ కేసులే బ‌య‌ట‌ప‌డుతాయి

క‌రోనా ప‌రీక్ష‌లు చేప‌డితే, భార‌త్‌లో ఎక్కువ కేసులే బ‌య‌ట‌ప‌డుతాయి

హైద‌రాబాద్‌: ఒక‌వేళ ఇండియా, చైనా దేశాలు క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌లు విస్తృతంగా చేప‌డితే, అప్పుడు ఆ దేశాల్లో అమెరికా క‌న్నా ఎక్కువ కేసులే న‌మోదు అవుతాయ‌ని డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. మెయిన్ న‌గ‌రం‌లో ఉన్న పూరిట‌న్ మెడిక‌ల్ ప్రోడ‌క్ట్స్ కంపెనీ విజిట్ చేసిన ట్రంప్ ఈ వ్యాఖ్య‌లు చేశారు.  అమెరికాలో రెండు కోట్ల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు చేప‌ట్టిన‌ట్లు ఆయ‌న తెలిపారు.  జ‌ర్మ‌నీ, ద‌క్షిణ కొరియా, ఇండియా క‌న్నా.. ఎక్కువ సంఖ్య‌లో వైర‌స్ ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.  

జ‌ర్మ‌నీలో ఇప్ప‌టి వ‌ర‌కు కేవ‌లం 40 ల‌క్ష‌ల మందికి మాత్ర‌మే క‌రోనా వైర‌స్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.  ద‌క్షిణ కొరియాలో 30 ల‌క్ష‌ల మందికి ప‌రీక్ష‌లు చేప‌ట్టారు.  అమెరికాలో ఇప్ప‌టి వ‌ర‌కు 19 ల‌క్ష‌ల క‌రోనా కేసులు న‌మోదు అయిన‌ట్లు జాన్స్ హాప్కిన్స్ వ‌ర్సిటీ పేర్కొన్న‌ది.  ల‌క్షా 9 వేల మంది మ‌ర‌ణించారు. భార‌త్‌లో ఇప్ప‌టి వ‌ర‌కు 40 ల‌క్ష‌ల మందికి క‌రోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన‌ట్లు కేంద్ర ఆరోగ్య‌శాఖ వెల్ల‌డించింది. ఎక్కువ స్థాయిలో టెస్టింగ్ జ‌రిగితేనే, ఎక్కువ కేసులు బ‌య‌ట‌ప‌డుతాయ‌ని ట్రంప్ అన్నారు. అమెరికాలో ఉన్న పూరిట‌న్ సంస్థ  హైక్వాలిటీ మెడిక‌ల్ స్వాబ్స్‌ను త‌యారు చేస్తున్న‌ది. ర్యాపిడ్ టెస్టింగ్‌లో ఈ మెడిక‌ల్ కిట్స్ కీల‌కం.   logo