ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Sep 05, 2020 , 09:54:33

భార‌త్‌, చైనా మ‌ధ్య ఉద్రిక్త‌త‌.. హెల్ప్ చేస్తాన‌న్న ట్రంప్‌

భార‌త్‌, చైనా మ‌ధ్య ఉద్రిక్త‌త‌.. హెల్ప్ చేస్తాన‌న్న ట్రంప్‌

హైద‌రాబాద్‌: భార‌త్‌,  చైనా మ‌ధ్య స‌రిహ‌ద్దు ఘ‌ర్ష‌ణ‌లు చోటుచేసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ సంఘ‌ట‌న‌ల‌పై అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు.  వైట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడుతూ.. భార‌త్‌, చైనా మ‌ధ్య స‌రిహ‌ద్దు స‌మ‌స్య దారుణంగా మారింద‌న్నారు.  ఈ స‌మ‌స్య ప‌రిష్కారంలో స‌హాయం చేసేందుకు తాను సిద్ధంగా ఉన్న‌ట్లు ట్రంప్ తెలిపారు. ఈస్ట్ర‌న్ ల‌డాఖ్‌లో భార‌త్‌, చైనా ద‌ళాలు వాస్త‌వాధీన రేఖ వెంట మోహ‌రించ‌డంతో.. అక్క‌డ ప‌రిస్థితి భ‌యాన‌కంగా మారింది.  భార‌త్‌, చైనా బోర్డ‌ర్ స‌మ‌స్య విప‌త్క‌రంగా ఉంద‌ని, చైనా దూకుడుగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు ట్రంప్ తెలిపారు. రెండు దేశాల‌తోనూ ఈ అంశం గురించి చ‌ర్చించాన‌ని, హెల్ప్ చేసేందుకు తాను సిద్ధంగా ఉన్న‌ట్లు ట్రంప్ చెప్పారు.  ఒక‌వేళ మేం ఏదైనా చేయాల‌నుకుంటే, ఆ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌గ‌ల‌మ‌ని, వారికి హెల్ప్ చేయ‌గ‌ల‌మ‌ని ట్రంప్ అన్నారు. ఈ విష‌యంపై రెండు దేశాల‌తోనూ సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్లు ట్రంప్ చెప్పారు.  మ‌రోవైపు ర‌ష్యా ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ర‌క్ష‌ణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌.. నిన్న చైనా ర‌క్ష‌ణ మంత్రి ఫెంగీతో భేటీ అయ్యారు.  
logo