e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, May 9, 2021
Home News క‌రోనా ఎఫెక్ట్ : రెమ్‌‌డెసివిర్ ఎగుమ‌తిపై నిషేధం

క‌రోనా ఎఫెక్ట్ : రెమ్‌‌డెసివిర్ ఎగుమ‌తిపై నిషేధం

క‌రోనా ఎఫెక్ట్ : రెమ్‌‌డెసివిర్ ఎగుమ‌తిపై నిషేధం

న్యూఢిల్లీ : కొవిడ్‌-19 కేసులు పెరుగుతున్న నేప‌థ్యంలో దేశంలో క‌రోనా పరిస్థితులు మెరుగుపడే వరకు రెమ్‌డెసివిర్ ఔషధం, ఇంజెక్షన్ ఎగుమతిపై నిషేధం విధించారు. ఈ మేర‌కు భారత ప్రభుత్వం ఆదివారం ఆదేశాలు జారీ చేసింది.

కరోనా వైరస్ కేసులకు చికిత్స చేయడానికి ఉపయోగించే యాంటీ-వైరల్ ఔషధం లేదా ఇంజెక్షన్ కొరతను అనేక రాష్ట్రాలు నివేదించిన నేప‌థ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్న‌ది. గత కొన్ని రోజులుగా దేశంలో కరోనా కేసులు రోజువారీ గరిష్ట స్థాయిని తాకినందున ప‌లు రాష్ట్రాల్లో మందుల కోసం మెడిక‌ల్ షాపుల ఎదుట‌ ప్రజలు క్యూలో నిలబడుతున్నారు.

“కొవిడ్‌ కేసుల ఇటీవ‌ల‌ భారతదేశం అంత‌టా పెరుగుతున్నాయి. 2021 ఏప్రిల్ 11 నాటికి 11.08 లక్షల పాజిటివ్‌ కేసులు న‌మోద‌య్యాయి. ఇవి క్రమంగా పెరుగుతున్నాయి. దాంతో కొవిడ్ రోగుల చికిత్సలో ఉపయోగించే ఇంజెక్షన్ రెమ్‌డెసివిర్ కోసం డిమాండ్ అకస్మాత్తుగా పెరిగింది. రాబోయే రోజుల్లో రెమ్‌డెసివిర్ ఇంజెక్షన్ కోసం డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్న‌ది ” అని కేంద్రం ఒక ప్రకటనలో తెలిపింది. రెమ్‌డెసివిర్ ఉత్పత్తిని పెంచడానికి ఫార్మాస్యూటికల్స్ విభాగం దేశీయ తయారీదారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

రెమ్‌డెసివిర్ అన్ని దేశీయ తయారీదారులు తమ వెబ్‌సైట్‌లో ప్రదర్శించాలని, వారి స్టాకిస్టులు / పంపిణీదారుల వివరాలను ఔషధాలు ల‌భించ‌డాన్ని సులభతరం చేయడానికి దాని తాజా క్రమంలో సూచించారు. “డ్రగ్స్ ఇన్స్పెక్టర్లు, ఇతర అధికారులు స్టాక్‌ల‌ను ధృవీకరించడానికి, హోర్డింగ్, బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు” అని ఆ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

కొవిడ్‌-19 కు వ్యతిరేకంగా పోరాటంలో ముఖ్యంగా తీవ్రమైన సమస్యలతో బాధపడుతున్న వయోజన రోగుల్లో రెమ్‌డెసివిర్ ఒక ముఖ్యమైన యాంటీ-వైరల్ ఔషధంగా పరిగణించబడుతున్న‌ది.

అమెరికాకు చెందిన మెస్స‌ర్స్ గిలియ‌డ్ సైన్సెస్‌లై సంస్థ‌తో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం ఏడు భారతీయ కంపెనీలు ఇంజెక్షన్ రెమ్‌డెసివిర్‌ను ఉత్పత్తి చేస్తున్నాయి. గిలియడ్ సైన్సెస్‌కు నెల‌కు దాదాపు 38.80 లక్షల యూనిట్ల సామర్థ్యం ఉంది. ఈ విష‌యాన్ని అన్ని ద‌వాఖాన‌లకు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో తెలియజేయాలని, అలాగే పర్యవేక్షించాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు కేంద్రం సూచించింది.

ఇవి కూడా చదవండి..

స్మ‌గ్ల‌ర్ల కాల్పుల్లో ఇద్ద‌రు పోలీసులు మృతి

ఎంసీడీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌కు షాక్

ధైర్యం, థ్రిల్, పోటీ స్ఫూర్తి ఉన్న పురుషులే మంచి తండ్రులు

అమెరికాలో కరోనా మ‌హ‌మ్మారి నాలుగో వేవ్..?!

అక్రమ ఆయుధ మార్కెట్: గ‌న్ కావాలా పెషావ‌ర్ రండి..!

వివాదాల్లో జో బైడెన్ కుమారుడు

బ‌డుగుల ఆశాజ్యోతి .. జ్యోతీరావ్ పూలే.. చరిత్ర‌లో ఈ రోజు

కాఫీ తాగండి.. ఆరోగ్యంగా ఉండండి..

వావ్‌..! అంగారకుడిపై ఇంద్రధనస్సు..?!

ఆరోగ్యంగా ఉంటేనే ధనవంతులం..

మనపై రంగుల ప్రభావం ఉంటుందా..?

తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ , ట్విటర్‌టెలిగ్రామ్‌ ను ఫాలో అవండి..

Advertisement
క‌రోనా ఎఫెక్ట్ : రెమ్‌‌డెసివిర్ ఎగుమ‌తిపై నిషేధం
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement