గురువారం 04 జూన్ 2020
International - Apr 24, 2020 , 12:25:16

క‌రోనా క‌ష్ట‌కాలంలో నేపాల్‌కు భార‌త్ సాయం

క‌రోనా క‌ష్ట‌కాలంలో నేపాల్‌కు భార‌త్ సాయం

ఖాట్మండ్:‌ క‌రోనా క‌ష్ట‌కాలంలో నేపాల్‌కు భార‌త్ అపన్న‌హ‌స్తం అందించింది. మ‌హ‌మ్మారి క‌రోనా ఎదుర్కొనేందుకు భారీ సాయం అందిస్తోంది. స‌మారు 23 టన్నుల అవసరమైన మందులను నేపాల్ కు పంపించింది. మందుల‌తో పాటు అవ‌స‌ర‌మైన మెడికల్స్ కిట్స్ అందులో ఉన్నాయి. అటు  క‌ష్ట‌కాలంలో భార‌త్ అందిస్తోన్న‌  సహకారానికి నేపాల్ ప్రధాని కృతజ్ఞతలు తెలిపారు. కాగా నేపాల్‌లో ఇప్పటివరకు 48 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి. ఇందులో 10 మంది కోలుకున్నారు.. అయితే అక్క‌డ క‌రోనా మ‌ర‌ణాలు మాత్రం ఇప్ప‌టివ‌ర‌కు సంభ‌వించ‌లేదు. ఇక అక్క‌డ కేసులు త‌క్కువ ఉన్న‌ప్ప‌టికీ లాక్‌డౌన్ పాటిస్తున్నారు. అయితే మ‌రింత‌గా పెర‌గ‌కుండా లౌక్‌డౌన్ మ‌రోసారి పొడ‌గించేందుకు అక్క‌డి ప్ర‌భుత్వం సిద్ద‌మ‌వుతుంది.


logo