ఆదివారం 24 జనవరి 2021
International - Dec 18, 2020 , 15:57:16

ఇండియా, చైనా మ‌ధ్య మ‌ళ్లీ మొద‌లైన చ‌ర్చ‌లు

ఇండియా, చైనా మ‌ధ్య మ‌ళ్లీ మొద‌లైన చ‌ర్చ‌లు

న్యూఢిల్లీ: ప‌్ర‌స్తుతం ల‌ఢ‌క్ సెక్టార్‌లో నెల‌కొన్న వివాదాన్ని ప‌రిష్క‌రించేందుకు ఇండియా, చైనా శుక్ర‌వారం మ‌రోసారి దౌత్య‌ప‌ర‌మైన చ‌ర్చ‌ల‌ను ప్రారంభించాయి. సుమారు 11 వారాల త‌ర్వాత రెండు దేశాలు మ‌ళ్లీ చ‌ర్చ‌లకు వెళ్ల‌డం గ‌మ‌నార్హం. వ‌ర్కింగ్ మెకానిజం ఫ‌ర్ క‌న్స‌ల్టేష‌న్ అండ్ కోఆర్డినేస‌న్ ఆన్ బోర్డ‌ర్ అఫైర్స్ (డ‌బ్ల్యూఎంసీసీ) కింద రెండు దేశాల రాయ‌బారులు వ‌ర్చువ‌ల్ స‌మావేశంలో పాల్గొన్నారు. కొన్ని నెల‌లుగా గ‌డ్డ క‌ట్టించే చ‌లిలో వేల సంఖ్య‌లో మోహ‌రించిన సైన్యాన్ని ఉప‌సంహ‌రించుకునే దిశ‌గా రెండు దేశాలు ఈ చ‌ర్చ‌లు జ‌రుపుతున్నాయి. చివ‌రిసారి ఈ స‌మావేశం సెప్టెంబ‌ర్ 30న జ‌రిగింది. అయితే బ‌ల‌గాల ఉప‌సంహ‌ర‌ణ‌కు రెండు దేశాల మ‌ధ్య ఒప్పందం కుద‌ర‌లేదు. దీంతో శుక్ర‌వారం మ‌రోసారి ఈ బ‌ల‌గాల ఉప‌సంహ‌ర‌ణే ప్ర‌ధాన ఎజెండాగా చ‌ర్చ‌లు ప్రారంభించిన‌ట్లు చైనా వ‌ర్గాలు వెల్ల‌డించాయి. సెప్టెంబ‌ర్ 30 నుంచి ఇప్ప‌టి వ‌ర‌కూ రెండుసార్లు మిలిట‌రీ స్థాయి చ‌ర్చ‌లు జ‌రిగినా.. అవి విఫ‌ల‌మ‌య్యాయి. 


logo