బుధవారం 23 సెప్టెంబర్ 2020
International - Jul 21, 2020 , 18:12:34

భార‌త్‌తో ర‌క్ష‌ణ బంధం బ‌ల‌ప‌డింది: అమెరికా

భార‌త్‌తో ర‌క్ష‌ణ బంధం బ‌ల‌ప‌డింది: అమెరికా

న్యూఢిల్లీ: భార‌త్-అమెరికా మ‌ధ్య ర‌క్ష‌ణ సంబంధాలు బ‌ల‌ప‌డ్డాయ‌ని అమెరికా ర‌క్ష‌ణ శాఖ కార్య‌ద‌ర్శి మార్క్ టీ ఎస్ప‌ర్ చెప్పారు. భార‌త్‌-అమెరికా మ‌ధ్య పెరిగిన ర‌క్ష‌ణ స‌హకారం గురించి నొక్కి చెప్పద‌లుచుకున్నానని ఆయ‌న పేర్కొన్నారు. 21వ శతాబ్దంలో వివిధ దేశాల మ‌ధ్య‌ ఏర్ప‌డ్డ అన్ని ముఖ్య‌మైన ర‌క్ష‌ణ సంబంధాల్లో భార‌త్‌-అమెరికా సంబంధాలు కూడా ఒక‌ట‌ని ఎస్ప‌ర్ అభిప్రాయ‌ప‌డ్డారు.

అమెరికాకు చెందిన యుద్ధ‌నౌక USS నిమిట్జ్ భార‌త నావికా ద‌ళంతో క‌లిసి సంయుక్త సైనిక విన్యాసాల్లో పొల్గొంటున్న‌ద‌ని, ఈ విన్యాసాలు భార‌త్‌-అమెరికా నావికా ద‌ళాల మ‌ధ్య‌గ‌ల బ‌ల‌మైన సంబంధాన్ని ప్ర‌పంచానికి చాటుతాయ‌ని ఎస్ప‌ర్‌ అభిప్రాయ‌ప‌డ్డారు. భార‌త్‌-చైనా మ‌ధ్య నెల‌కొన్న ప‌రిస్థితిని తాము చాలా ద‌గ్గ‌రి నుంచి ప‌ర్య‌వేక్షిస్తున్నామ‌ని చెప్పారు. అయితే, రెండు వైపుల నుంచి ఉద్రిక్త‌లను త‌గ్గించే ప్ర‌య‌త్నాలు జ‌రుగుతుండ‌టం హ‌ర్ష‌ణీయ‌మ‌ని ఆయ‌న పేర్కొన్నారు.    ‌ 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo