శనివారం 06 జూన్ 2020
International - Apr 15, 2020 , 15:21:35

మలేషియాకు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ట్యాబ్లెట్లు

మలేషియాకు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ట్యాబ్లెట్లు

న్యూఢిల్లీ: కరోనాపై పోరాడుతున్న ప్రపంచ దేశాలకు సహాయం అందించేందుకు భారత్‌ ముందుకు వచ్చింది. ఇందులో భాగంగా కరోనాను కట్టడి చేయడానికి ఉపయోగిస్తున్న హైడ్రాక్సీక్లోరోక్విన్‌ మెడిసిన్‌ను మలేషియాకు అందించనుంది. మొత్తం 89,100 ట్యాబ్లెట్లను ఎగుమతి చేయడానికి భారత్‌ అంగీకరించిందని మలేషియా విదేశాంగ సహాయ మంత్రి కమరుద్దిన్‌ జాఫర్‌ వెల్లడించారు. తమకు హైడ్రాక్సీక్లోరోక్విన్‌ ట్యాబ్లెట్లను అందించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ కోరడంతో ఈ ట్యాబ్లెట్ల ఎగుమతిపై విధించిన ఆంక్షలను భారత్‌ పాక్షికంగా ఎత్తివేసింది. దీంతో వివిధ దేశాల అధ్యక్షులు తమకు క్లోరోక్విన్‌ ట్యాబ్లెట్లను అందించాలని భారత్‌ను కోరుతున్న విషయం తెలిసిందే.


logo