గురువారం 02 జూలై 2020
International - Jun 05, 2020 , 13:22:41

కువైట్‌లో భార‌తీయుల‌ ఉపాధికి క‌రోనా గండం

కువైట్‌లో భార‌తీయుల‌ ఉపాధికి క‌రోనా గండం

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచ దేశాల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న‌ది. ఈ మ‌హ‌మ్మారి ధాటికి అగ్ర‌రాజ్యం అమెరికాతోపాటు ఎన్నో దేశాలు ఆర్థికంగా చితికిపోయాయి.  కార‌ణంగా  చాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి భవిష్యత్తులో చాలా మార్పులకు తెరలేపుతోంది. వ్యాపారాలు నిలిచిపోయి, ప‌రిశ్ర‌మ‌లు మూత‌ప‌డ‌టంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా కోట్ల మంది ఉపాధి కోల్పోయారు. బ‌తుకుదెరువు ప‌రాయి దేశాల‌కు వెళ్లిన కార్మికులు పొట్ట చేత‌బ‌ట్టుకుని స్వదేశానికి తిరిగి రావాల్సిన‌ పరిస్థితులు నెల‌కొన్నాయి. 

ఈ నేపథ్యంలో కువైట్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. వైరస్ వ్యాప్తిని అరికట్టే క్రమంలో ఆ దేశ జనాభాలో 70 శాతంగా ఉన్న వలస జ‌నాభాను 30 శాతానికి తగ్గించాలని నిర్ణ‌యించింది. కువైట్ ప్రధాని షేక్ సబా అల్ ఖలీద్ అల్ హమద్ అల్ సబా ఈ విష‌యాన్ని మీడియాకు వెల్ల‌డించారు. వైరస్ ప్రభావంతో చమురు ధరలు భారీగా పడిపోయాయి. దాని ప్రభావం కువైట్ ఆర్థిక వ్యవస్థపై పడింది. దాంతో అనేక మంది  ఉపాధి కోల్పోవాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. 

ఈ ప‌రిస్థితుల్లో త‌మ పౌరులకు ఉద్యోగాలు కల్పించాలంటే ప్రవాసుల సంఖ్యను తగ్గించడం ఒక్కటే మార్గమ‌ని కువైట్ ప్ర‌భుత్వం భావిస్తున్న‌ది. అందుకే ప్ర‌వాసుల సంఖ్య‌ను 70 శాతం నుంచి 30 శాతానికి త‌గ్గించాల‌ని నిర్ణ‌యించింది. కువైట్ మొత్తం జనాభా 48 లక్షలు మంది అయితే, అందులో విదేశీయులే 34 లక్షల మంది ఉన్నారు. వారిలో భారత్, శ్రీలంక, బంగ్లాదేశ్‌ల‌కు చెందినవారే అధికం. అందులోనూ భార‌తీయులే అత్య‌ధికంగా ఉన్నారు. కువైట్ తీసుకున్న తాజా నిర్ణయంతో ఇప్పుడు వారిలో చాలామంది ఉపాధి కోల్పోమే ప్ర‌మాదం ఉంది. 


logo