శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Aug 29, 2020 , 13:51:16

కొత్త ఆకృతిలో ఇంద్రధనస్సు.. ఫొటోలు వైరల్‌

కొత్త ఆకృతిలో ఇంద్రధనస్సు.. ఫొటోలు వైరల్‌

పారిస్‌: ఇంద్రధనుస్సు ఏ ఆకృతిలో ఉంటుంది? అంటే ఎవరైనా అర్ధవృత్తాకారంలో లేదా అర్ధచంద్రాకకారంలో ఉంటుంది అని ఠక్కున చెప్పేస్తారు. కానీ ఇప్పుడు ఇక రెండో సమాధానం కూడా చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫ్రాన్స్‌ దేశంలో అద్భుతం చోటుచేసుకుంది. సముద్ర ఉపరితలంపై చదునైన (ప్లాట్‌) రెయిన్‌బో కనువిందు చేసింది. ఈ ఫొటో  ఇంటర్‌నెట్‌లో వైరల్‌ అవుతోంది.

ఫ్రాన్స్‌ దేశంలో ఫ్రాన్సిస్‌ తుఫాన్‌ ముగిసిన వెంటనే ఈ అరుదైన దృగ్విషయం కనిపించింది. డెవాన్ ఆగ్నేయ తీరంలోని టోర్బే బరోలోగల టోర్క్వేలోని పైగ్ట్నన్‌ బీచ్‌లో సముద్రం ఉపరితలం మీద దుప్పటిలా ఇంద్రధనుస్సు కప్పేసింది. దీన్ని ఫొటో తీసి 'టోర్బే ఇన్ పిక్చర్స్' ఫేస్‌బుక్‌ పేజీలో పోస్ట్‌ చేశారు. దీన్ని చూసినవారంతా ఆశ్చర్యపోతున్నారు. అద్భుతం అంటూ కామెంట్ చేస్తున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo