మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Sep 03, 2020 , 22:13:48

తనను కరిచిన షార్క్‌ను దొరకపట్టుకొచ్చాడు.. వీడియో వైరల్‌!

తనను కరిచిన షార్క్‌ను దొరకపట్టుకొచ్చాడు.. వీడియో వైరల్‌!

న్యూయార్క్‌: సముద్రంలో ఈతకొడుతున్నప్పుడు షార్క్‌ (సొరచేప) వెంటపడితే ఏం చేస్తారు? ఎవరైనా తప్పించుకోవాలని చూస్తారు. కానీ, ఒకతను తనను కరిచిన నర్స్‌ షార్క్‌ను చేతితో పట్టుకొని ఒడ్డుకు వచ్చాడు. దీంతో అక్కడున్నవారంతా మొదట షాక్‌కు గురయ్యారు. అనంతరం దగ్గరికి వచ్చి ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. 

యూఎస్‌లోని ఫ్లోరిడాలోగల జెన్సన్‌ బీచ్‌ వద్ద ఈ సంఘటన జరిగింది. మార్టిన్ కౌంటీ అనే వ్యక్తి సొరచేపను పట్టుకొని వచ్చాడు. షార్క్ సుమారు 45 నిమిషాల పాటు అతడి దగ్గరే ఉంది. ఓ పెంపుడు జంతువులాగా దాన్ని అతడు పట్టుకున్నాడు. నర్స్‌ షార్క్‌లు చాల చిన్నవి. వాటి దవడలు బలంగా ఉంటాయి. మనుషులను కరిచే షార్క్‌లలో ఇవి నాలుగో స్థానంలో ఉన్నాయి. కాగా, పారామెడిక్స్‌ వచ్చి మార్టిన్‌కు చికిత్స అందించారు. అనంతరం అతను దానిని నీటిలో వదిలేశాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. మరెందుకాలస్యం మీరు కూడా చూసేయండి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo