శనివారం 30 మే 2020
International - Apr 06, 2020 , 21:53:37

పాకిస్థాన్‌లో పెరుగుతున్న క‌రోనా బాధితుల సంఖ్య‌

పాకిస్థాన్‌లో పెరుగుతున్న క‌రోనా బాధితుల సంఖ్య‌

ఇస్లామాబాద్: క‌రోనా వైర‌స్ పాకిస్తాన్ లో అంతకంతకూ పెరుగుతోన్నది. ఈ క్ర‌మంలో కరోనా కేసుల‌పై ఆ దేశ సుప్రీంకోర్టు ప్ర‌భుత్వాన్ని నివేదిక కోరింది. అయితే ఏప్రిల్ చివ‌రినాటికి దేశంలో మ‌రింత కేసులు పెరిగే అవ‌కాశ‌మున్న‌ద‌ని కోర్టుకు ప్ర‌భుత్వం తెలిపింది. దాదాపుగా బాధితుల సంఖ్య 50వేల‌కు చేరుకునే అవ‌కాశ‌మున్న‌ద‌ని పేర్కొంది. అటు నియంత్ర‌ణ‌కు చ‌ర్య‌లు చేప‌ట్టామ‌ని  కోర్టుకు నివేదించింది.  కరోనాపై  ఎప్ప‌టిక‌ప్పుడూ  ప్రజల్లో అవగాహన ప్రచారం జరుగుతోందని సుప్రీంకోర్టుకు తెలిపింది. ఇక విమానాశ్రయాలలో దిగ్బంధం కేంద్రాలు ఏర్పాటు చేసినట్టు స్పష్టం చేసింది. కాగా పాక్ లో ఇవాళ ఒక్క‌రోజే 326 పాజిటివ్ కేసులు నమోదు కాగా...మొత్తం కేసుల సంఖ్య 3,161 కి చేరుకుంది. ఇక మ‌ర‌ణాల సంఖ్య 47రి చేరుకుంది.


logo