బుధవారం 03 జూన్ 2020
International - Apr 08, 2020 , 01:29:57

స్పెయిన్‌లో మళ్లీ పెరిగిన మృతులు

స్పెయిన్‌లో మళ్లీ పెరిగిన మృతులు

  • ఒక్కరోజే 743 మంది మృతి 
  • ఇరాన్‌లో మెరుగైన పరిస్థితి 

లండన్‌/ రియాద్‌/ టెహ్రాన్‌, ఏప్రిల్‌ 7: ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 13.50 లక్షల మందికి కరోనా వైరస్‌ సోకగా, 75,500 మందికి పైగా మృత్యువాత పడ్డారు. అమెరికాలో గత 24 గంటల్లో 1,150 మరణాలు సంభవించాయి. స్పెయిన్‌లో వరుసగా నాలుగు రోజులుగా తగ్గిన మరణాలు మంగళవారం పెరిగాయి. సోమవారం 637 మంది మృత్యువాత పడగా, అది మంగళవారం 743 మందికి చేరుకున్నది. ఇక ఇప్పటి వరకు ఎటువంటి ఆంక్షలు విధించని స్వీడన్‌లో మంగళవారం 114 మంది మరణాలతో మొత్తం మృతుల సంఖ్య 591 మందికి చేరింది. సౌదీ అరేబియాలో కేసుల సంఖ్య మరికొన్ని వారాల్లో రెండు లక్షలకు చేరుకోవచ్చని అధికారిక మీడియా ఆందోళన వ్యక్తం చేసింది. ఆ దేశంలో ఇప్పటివరకూ 2,795 కేసులు, 41 మరణాలు నమోదయ్యాయి. ఇరాన్‌లో వరుసగా ఏడోరోజు కొత్త కేసుల నమోదు తగ్గుముఖం పట్టడంతో మంగళవారం ఆ దేశ పార్లమెంట్‌ సమావేశమైంది.logo