మంగళవారం 26 మే 2020
International - Apr 25, 2020 , 14:50:36

అమెరికాలోనే 25శాతం క‌రోనా మ‌ర‌ణాలు

అమెరికాలోనే 25శాతం క‌రోనా మ‌ర‌ణాలు

కరోనాను కట్టడిలో అమెరికా పూర్తిగా విఫ‌ల‌మవుతోంది. ఎంత‌లా అంటే చాలా పేద దేశాల కంటే అధ్వాన్నంగా వ్యవహరిస్తోంది. ఇప్ప‌టికే ప్ర‌పంచంలోనే ఎక్కువ మ‌ర‌ణాలు, ఎక్కువ కేసులు అక్కడే న‌మోద‌వుతున్నాయి. మామూలుగా అక్కడ మనుషుల ప్రాణాలకు లెక్కే లేకుండా పోతోంది. క‌రోనాతో రోజూ 1500 నుంచి 2000 దాకా చనిపోతున్నారు. తాజాగా మొత్తం కేసులు 9లక్షలు దాటేయగా... మరణాల సంఖ్య 52 వేలు దాటింది.  ప్రపంచంలో నాలుగో వంతు మరణాలు అమెరికాలోనే సంభవిస్తున్నాయి. రోజూ ప్రపంచంలో నమోదవుతున్న మొత్తం కేసుల్లో 30 శాతం అమెరికావే ఉంటున్నాయి. 

గతేడాది డిసెంబర్‌లో కరోనా వైరస్ చైనాలో పుట్టినప్పుడు..ఎలా ఎదుర్కొంటుందోన‌ని అంతా సందేహపడ్డారు. ఛాలెంజ్‌గా తీసుకున్న డ్రాగ‌న్ కంట్రీ దానిని పూర్తిగా నియంత్ర‌ణ‌లోకి తీసుకువ‌చ్చింది. అలాంటిది అమెరికా మాత్రం... గుడ్డెద్దు చేలో పడినట్లు వ్యవహరిస్తోంది. వాస్త‌వానికి ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన ప్రతి 10 లక్షల మందిలో 25 మంది చనిపోతుండ‌గా... అమెరికాలో ఈ సంఖ్య 158గా ఉంది. స్పెయిన్‌లో 482, ఇటలీలో 430, ఫ్రాన్స్‌లో 341, జర్మనీలో 69, బ్రిటన్‌లో 287గా ఉంది. ఈ దేశాలతో పోల్చితే... అమెరికాలో మరణాల రేటు తక్కువగానే ఉన్నట్లు కనిపిస్తున్నా... భారత్‌తో పోల్చితే... ఇది చాలా చాలా ఎక్కువ. ఇండియాలో ప్రతి 20 లక్షల మందిలో కరోనా సోకి చనిపోతున్న వారి సంఖ్య 1గా ఉంది.  


logo