గురువారం 02 ఏప్రిల్ 2020
International - Mar 27, 2020 , 13:35:25

సింగపూర్‌లో దగ్గరగా కూర్చుంటే 6 నెలల జైలు

సింగపూర్‌లో దగ్గరగా కూర్చుంటే 6 నెలల జైలు

  హైదరాబాద్:  ప్రపంచంలో అధిక జనసాంద్రత కలిగిన దేశాల్లో సింగపూర్ ఒకటి. పౌరుల ఆరోగ్య, భద్రతకు సంబంధించి ఆ చిన్నదేశంలో కఠినమైన నిబంధనలు అమల్లో ఉంటాయి. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మడం, చెత్తపారేయడం మీద తీవ్రమైౌన శిక్షలు అమలయ్యే సింగపీూర్ ఎప్పుడూ కడిగిన ముత్యంలా ఉంటుంది. ఇప్పుడు కరోనా కలకలం నేపథ్యంలో సింగపూర్ మనుషులు గుమిగూడడంపై నిబంధనలు ప్రవేశపెట్టింది. హోటళ్లు, పార్కులు తదితర తదితర పబ్లిక్ స్థలాల్లో ఎవరైనా దగ్గరగా కూర్చుంటే్ 6 నెలల జైలుశిక్ష విధిస్తామని తాజాగా సింగపూర్ సర్కారు నిబంధనలు జారీ చేసింది.


logo