సోమవారం 21 సెప్టెంబర్ 2020
International - Jul 11, 2020 , 18:27:43

శ్రీలంక జాలర్లను రక్షించిన తీర రక్షణ దళం

శ్రీలంక జాలర్లను రక్షించిన తీర రక్షణ దళం

ముంబై : భారత వాయు, తీర రక్షణ దళాలు సంయుక్తంగా అరేబియా సముద్రంలో బోటులో చిక్కుకుపోయిన శ్రీలంకకు చెందిన ఆరుగురు జాలర్లను కాపాడాయి. చెన్నైకి తూర్పున 170 మైళ్ల దూరంలో పోర్ట్ బ్లెయిర్‌కు వాయువ్యదిశలో 190 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ఆపరేషన్ జరిగింది. ఈ మేరకు ఇండియన్ కోస్ట్ గార్డ్ అధికారిక ట్విట్టర్‌లో వివరాలు తెలిపింది. వాయుసేన, ఐసీజీ సంయుక్త ఆధ్వర్యంలో రాజ్‌ కమల్ నౌక ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లోనూ ఆపదలో ఉన్న ఆరుగురు శ్రీలంక జాలర్లను రక్షించిందని చెప్పింది.

నివేదికల ప్రకారం.. జూలై 5న, ఒక వర్తక నౌక, విశాఖకు వెళ్తుండగా ఆరుగురు నావికులతో ఉన్న క్యాప్సైజ్డ్ ఫిషింగ్ పడవను చూసింది. బోటు లొకేషన్ చెన్నైలోని మారిటైమ్ రెస్క్యూ కో ఆర్డినేషన్ సెంటర్ (ఎంఆర్‌సీసీ)కు తెలిపింది. దీంతో సమాచారం కోసం ముంబైలోని ఎంఆర్‌సీసీ అందించిన సమాచారంతో వారిని సురక్షితంగా రక్షించారు. ప్రాణాలతో బయటపడ్డ ఆరుగురు శ్రీలంకలోని ట్రింకోమలీకి చెందిన వారిగా గుర్తించారు. గత నాలుగు రోజుల కిందట వాతావరణం సహకరించక సముద్రంలో చిక్కుకుపోయినట్లు వార్తలు వచ్చాయి. కాగా, ఐసీజీ అధికారులు కొలంబోలోని అధికారులతో సమన్వయం చేసి, వారి క్షేమ సమాచారం అందించారు. ఆధారాలను ధ్రువీకరించుకొని తిరిగి సురక్షితంగా పంపేందుకు ఏర్పాట్లు చేశారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.logo