శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
International - Feb 23, 2021 , 12:02:30

139 ఏళ్ల ఇల్లు.. రోడ్డుపై అలా వెళ్లింది.. వైర‌ల్ వీడియో

139 ఏళ్ల ఇల్లు.. రోడ్డుపై అలా వెళ్లింది.. వైర‌ల్ వీడియో

ఇల్లేంటి.. రోడ్డుపై వెళ్ల‌డం ఏంటి అనిపిస్తోంది. ఈ కింద ఉన్న వీడియో చూడండి మీ క‌ళ్ల‌ను మీరే న‌మ్మ‌లేరు. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కోలో 139 ఏళ్ల నాటి ఈ ఇంటిని ఒక చోటు నుంచి మ‌రో చోటుకు త‌ర‌లించారు. ఈ అరుదైన దృశ్యాన్ని త‌మ కెమెరాల్లో బంధించ‌డానికి వంద‌లాది మంది రోడ్డుకు ఇరువైపులా నిల్చున్నారు. 1880ల్లో నిర్మించిన ఈ ఇంటికి ఇంగ్లాండ‌ర్ హౌజ్ అని పేరు. ఇందులో ఆరు బెడ్‌రూమ్‌లు, మూడు బాత్‌రూమ్‌లు ఉన్నాయి. ఈ ఇంటిని ఓ హైడ్రాలిక్ ట్రాలీపై ఉంచి రిమోట్ కంట్రోల్ సాయంతో మెల్ల‌గా మ‌రో చోటుకి త‌ర‌లించారు. 

ఇంటిని త‌ర‌లించ‌డం అంటే సాధార‌ణ విష‌యం కాదు క‌దా. అందుకే ఈ ప్ర‌క్రియ చాలా మెల్ల‌గా సాగింది. ఆ హైడ్రాలిక్ ట్రాలీ గంట‌కు కేవ‌లం ఒక మైలు వేగంతో ముందుకు క‌దిలింది. దీనికి సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇంటిని త‌ర‌లించే ప్ర‌క్రియ నిజానికి 8 ఏళ్ల కింద‌టే ప్రారంభ‌మైంది. దీనిని త‌ర‌లించ‌డం కోసం చెట్ల‌ను క‌ట్ చేశారు. పార్కింగ్ మీట‌ర్ల‌ను తొల‌గించారు. ఎల‌క్ట్రిక్ లైన్ల‌ను తీసేశారు. మొత్తానికి ఫిబ్ర‌వ‌రి 21న, అంటే ఆదివారం ఈ ప్ర‌క్రియ‌ను ముగించారు. ఇప్పటి వ‌ర‌కూ ఈ ఇల్లు ఉన్న ప్ర‌దేశంలో కొత్త‌గా అపార్ట్‌మెంట్ నిర్మించ‌నున్నారు. 


VIDEOS

logo