మంగళవారం 24 నవంబర్ 2020
International - Nov 16, 2020 , 16:25:09

ఎలుక వేషంలో మెట్రో రైలెక్కాడు..! వీడియో వైరల్‌

ఎలుక వేషంలో మెట్రో రైలెక్కాడు..! వీడియో వైరల్‌

న్యూయార్క్‌: కరోనా మహమ్మారి విజృంభణ ప్రారంభమైననాటినుంచి ఫేస్‌మాస్క్‌ తప్పనిసరైంది. టీకా వచ్చేదాకా మనల్ని మనం కాపాడుకోవాలంటే ఉన్న ఏకైక అస్త్రం మాస్కు మాత్రమే. అయితే, చాలామంది వింత మాస్కులతో వార్తల్లోకెక్కుతున్నారు. ఒకరు డైనోసార్‌ గెటప్‌లో వస్తే.. మరొకరు నిజంగా పామునే మాస్కుగా వాడిన సరదా సంఘటనలు కూడా ఉన్నాయి. ఆ తరహాలోనే ఓ వ్యక్తి ఎలుక వేషంలో మెట్రో రైలెక్కాడు. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నది. 

న్యూయార్క్‌ స్టేషన్‌లో మెట్రో రైలు వచ్చి ఆగింది. వెంటనే ఫుట్‌పాత్‌ మీదున్న ఎలుక వేషధారి అందులోకి ఎక్కాడు. ఎలుక ముఖంలా మాస్కు.. వెనుక తోకతో చాలా వింతగా కనిపించాడు. చకచకా రైలెక్కి సీట్‌పై కూర్చున్నాడు. అంతా ఆశ్చర్యంత అతడిని చూస్తుండిపోయారు. అతడు ఎవరో కాదు నాటకరంగ కళాకారుడు జోనాథన్‌ లియోన్స్‌. మాస్కుపై అవగాహన కల్పించేందుకే అలా తయారై వచ్చాడట. ఈ వీడియోను సామాజిక మాధ్యమాల్లో.. ముఖ్యంగా టిక్‌టాక్‌లో చాలామంది వీక్షించారు.