బుధవారం 03 జూన్ 2020
International - Apr 01, 2020 , 00:28:34

వీడియోకాన్ఫరెన్స్‌లో భద్రతామండలి భేటీ

వీడియోకాన్ఫరెన్స్‌లో భద్రతామండలి భేటీ

  • ఐరాస చరిత్రలో తొలిసారి 

ఐరాస, మార్చి 31: కరోనా మహమ్మారి నేపథ్యం లో చరిత్రలో తొలిసారిగా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్సీ) సోమవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమావేశమైంది. ఐదు శాశ్వత సభ్య దేశాలు సహా మొత్తం 15 సభ్య దేశాలతో కూడిన కౌన్సిల్‌ సమావేశానికి ఐరాసలో చైనా రాయబారి జాంగ్‌ జున్‌ అధ్యక్షత వహించారు. న్యూయార్క్‌లో కరోనా తీవ్రత నేపథ్యంలో సభ్య దేశాల రాయబారులు, ఐరాస సిబ్బంది తమ ఇండ్ల వద్ద నుంచే విధులు నిర్వహిస్తున్నారు. ఇదే క్రమంలో భద్రతామండలి కూడా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా భేటీని నిర్వహించింది. ఈ సమావేశం నాలుగు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించింది. వాటిలో ఉత్తరకొరియాపై ఆంక్షల పునరుద్ధరణకు నిపుణుల కమిటీకి అధికారం కల్పించడం, సోమాలియాకు ఐరాస ఆర్థిక సాయం పథకం కొనసాగింపు ఉన్నాయి.


logo