శనివారం 06 మార్చి 2021
International - Jan 25, 2021 , 19:21:58

అప్పు కోసం పార్కు తాకట్టు పెట్టేందుకు ఇమ్రాన్‌ నిర్ణయం!

అప్పు కోసం పార్కు తాకట్టు పెట్టేందుకు ఇమ్రాన్‌ నిర్ణయం!

ఇస్లామాబాద్: గత కొంత కాలంగా పాకిస్తాన్‌ ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నది. పాకిస్తాన్‌ ప్రభుత్వం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కేందుకు ఇస్లామాబాద్‌లోని ఓ పెద్ద పార్కును విదేశాలకు తాకట్టు పెట్టాలని ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆలోచిస్తున్నట్లుగా సమాచారం. ఇస్లామాబాద్‌ నగరంలోని అతిపెద్ద పార్కు ఫాతిమా-జిన్నా పార్కును తాకట్టు పెట్టి దాదాపు 500 బిలియన్ల రుణం పొందడానికి ఆలోచిస్తున్నట్లు తెలుస్తున్నది.

మదర్-ఏ-మిల్లాట్ ఫాతిమా జిన్నా పేరు మీద ఉన్న ఈ ఎఫ్ -9 పార్క్ 759 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నది. ఫెడరల్ క్యాబినెట్ తదుపరి సమావేశంలో ఈ పార్కును తాకట్టు పెట్టే ప్రతిపాదనను ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ క్యాబినెట్‌ ముందుకు తెస్తారని పాకిస్తాన్ పత్రిక ది డాన్ వార్తాకథనంలో పేర్కొన్నది. ఐటెమ్ నంబర్ ఆరుగా ఎజెండాలో చేర్చారని, దీనిపై చర్చించిన మీదట తనఖా పెట్టాలని ఇమ్రాన్‌ నిర్ణయించారని డాన్‌ పత్రిక వెల్లడించింది. క్యాబినెట్‌ సమావేశం మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్నది. ఇస్లామాబాద్‌ నగరంలోని ఎఫ్-9 పార్కు పాకిస్తాన్‌లో అతిపెద్ద పచ్చని ప్రాంతాలలో ఒకటిగా చెప్తారు. ఈ పార్కును మార్టిగేజ్‌ పెట్టేందుకు క్యాపిటల్ డెవలప్‌మెంట్ అథారిటీ ఇప్పటికే నో-ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ జారీ చేసింది. గతంలో కూడా జాతీయ, అంతర్జాతీయ బాండ్ల ద్వారా రుణాలు పొందడానికి వివిధ భవనాలు, సంస్థలు, రోడ్లను పాకిస్తాన్ అధికారులు తనఖా పెట్టిన విషయం తెలిసిందే.

సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఏఈ) లతో క్షీణించిన సంబంధాల నేపథ్యంలో వారికి చెల్లించే రుణాల విషయంలో ఈ ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తున్నది. సౌదీ అరేబియా 2020 ఆగస్టులో పాకిస్తాన్‌ను 3 బిలియన్ డాలర్ల సాఫ్ట్ లోన్ తిరిగి చెల్లించాలని కోరింది. పాకిస్తాన్ కార్మికులకు వర్క్ వీసాలు ఇవ్వడాన్ని ఇటీవల యుఏఈ నిషేధించింది.

ఇవి కూడా చదవండి..

కశ్మీర్‌లో అల్లర్లకు పాకిస్తాన్ ఐఎస్‌ఐ కుట్ర బహిర్గతం

రాములోరి గుడికి పెండ్లిలో విరాళాలు

రిపబ్లిక్‌ డే నాడు ఇద్దరు ప్రత్యేక అతిథులు.. ఎవరో తెలుసా?

ఆర్డీ ప‌రేడ్‌లో మ‌హిళా పైల‌ట్ స్వాతి రాథోడ్ ఫ్లైపాస్ట్

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo