బుధవారం 03 జూన్ 2020
International - May 01, 2020 , 18:03:18

ఇమ్రాన్‌ఖాన్ కు మ‌రోసారి క‌రోనా ప‌రీక్ష‌లు

ఇమ్రాన్‌ఖాన్ కు మ‌రోసారి క‌రోనా ప‌రీక్ష‌లు

ఇస్లామాబాద్ :  ఇమ్రాన్‌ఖాన్‌కు క‌రోనా టెన్ష‌న్ ప‌ట్టుకుంది. ఇదివర‌కే క‌రోనా అనుమానంతో సెల్ఫ్ క్వారంటైన్ కు వెళ్లిన ఇమ్రాన్‌కు ప‌రీక్షలు నిర్వ‌హించ‌గా నెగిటివ్‌గా తేలింది. అయితే పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ స్పీకర్ అసద్ ఖురేషీకి క‌రోనా పాజిటివ్ రావ‌డంతో మ‌ళ్లీ క‌రోనా భ‌యం పట్టుకుంది. ఇందుకు కార‌ణం కూడా ఉన్న‌ది. పాజిటివ్ వ‌చ్చిన స్పీక‌ర్ ఖురేషీ రెండు రోజుల క్రితం ఇమ్రాన్ ని కలిశారు. ఈ నేప‌థ్యంలోనే మ‌ళ్లీ ఇమ్రాన్ ఖాన్ కు ముందు జాగ్రత్త చర్యగా ఆరోగ్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల రిపోర్టు వెల్లడికావాల్సి ఉన్న‌ది.  గతంలోనూ ఓ మారు ఇమ్రాన్ కు పరీక్షలు చేసిన సంగతి తెలిసిందే. అటు అసద్ ఖురేషీ కుటుంబ స‌భ్యుల‌ను  అధికారులు క్వారంటైన్ చేశారు. ఇటీవలి కాలంలో అసద్ ఎవరెవరిని కలిశారు? ఆయన దగ్గరకు ఎవరెవరు వచ్చారు? అన్న విషయాన్ని గుర్తించేందుకు అధికారులు ఆరా తీస్తున్నారు.


logo