గురువారం 03 డిసెంబర్ 2020
International - Oct 20, 2020 , 00:58:54

నియంత కంటే దారుణం ఇమ్రాన్‌

నియంత కంటే దారుణం ఇమ్రాన్‌

  • పాకిస్థాన్‌లో ప్రతిపక్షాల ధ్వజం

కరాచి:  పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ అసమర్థుడని, బుద్ధిహీనుడని అక్కడి ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. ఆయన పాలన నియంతృత్వం కంటే దారుణంగా ఉన్నదని మండిపడ్డాయి. ఇమ్రాన్‌ ప్రభుత్వాన్ని గద్దెదించేందుకు పాకిస్థాన్‌ డెమొక్రటిక్‌ అలయన్స్‌ పేరిట  కూటమిగా ఏర్పడిన 11 విపక్ష పార్టీలు.. దేశవ్యాప్తంగా ఉద్యమం చేపడుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం కరాచీలో భారీ సభను నిర్వహించాయి. ఈ సందర్భంగా పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ అధినేత బిలావల్‌ భుట్టో జర్దారీ మాట్లాడుతూ.. ఎంతో మంది నియంతలు చరిత్రలో కలిసిపోయారని, ఈ కీలుబొమ్మ సర్కార్‌ ఏం నిలబడగలదని ప్రశ్నించారు. తమది నిర్ణయాత్మక పోరు అని చెప్పారు.