ఇస్లామాబాద్ : ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ ప్రభుత్వం ఏర్పడటంతో అక్కడ కొత్త కొత్త చట్టాలు అమలులోకి వస్తున్నాయి. వీరి ప్రభావం (Taliban Effect) పక్కనే ఉన్న పాకిస్తాన్‌పై కూడా పడింది. వారి మాదిరిగానే మహిళలు ధరించే డ్రెస్‌లపై కన్నుపడింది. ఉన్నపళంగా కొత్త డ్రెస్ కోడ్‌ను ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. దీనిని పలువురు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తాలిబాన్‌తో అంటకాగి వారి విధానాలను ఇక్కడ కూడా అమలుపర్చాలని చూడటం మూర్ఖత్వమే అవుతుందని తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు.
ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వం అన్ని కేంద్ర విద్యా సంస్థల ఉపాధ్యాయులు పాటించేలా డ్రెస్ కోడ్ డిక్రీని జారీ చేసింది. ఫెడరల్ డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ (ఎఫ్‌డీఈ) కింద అన్ని పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ముఖ్యంగా మహిళలు జీన్స్, టీ షర్టులు, టైట్స్ ధరించరాదని పేర్కొన్నది. ఇటీవల బహవల్పూర్ మెడికల్ కాలేజీలో విద్యార్థులు ఇలాంటి దుస్తులు ధరించకుండా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
పాకిస్తాన్‌కు చెందిన విద్యావేత్త పర్వేజ్ హుద్భాయ్తో పాటు చాలా మంది ప్రభుత్వం జారీ చేసిన ఈ ఆదేశాలను తీవ్రంగా వ్యతిరేకించారు. ‘మేం ఇప్పటికే ప్రతీ విషయంలో వెనుకబడి ఉన్నాం. ఇప్పుడు ప్రభుత్వం నాణ్యమైన విద్యకు బదులుగా తాలిబాన్ పాలనను స్వీకరించాలని చూస్తున్నది. ఇది చాలా దురదృష్టకరం. ఇలాంటి డిక్రీలు జారీ చేయడానికి బదులుగా విద్యాభివృద్ధికి పాటుపడటం చాలా మంచిది’ అని పర్వేజ్ వ్యాఖ్యానించారు.
ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా పాకిస్తాన్‌లోని పలు నగరాల్లో నిరసనలు మొదలయ్యాయి. లైంగిక అఘాయిత్యాలకు కారణం మహిళల వస్త్రధారణే అని నిందిస్తున్న ప్రధాని ఇమ్రాన్‌ఖాన్.. ఇలాంటి డిక్రీలు జారీ చేయడంలో ఎలాంటి ఔచిత్యం లేదంటున్నారు. మూడేండ్ల బాలికలపై లైంగికదాడులు, హత్యలకు ఏ నియమాలు వర్తిస్తాయో ప్రభుత్వమే చెప్పాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
మంచి ఫుడ్ తిన్నా.. 50ల్లో గుండె సమస్యలు ఎందుకొస్తాయి?
ఆఫ్ఘన్లో నాలుగో రోజు మహిళల ఆందోళన
సరిహద్దులో అత్యవసర ల్యాండింగ్‌కు ఎయిర్ స్ట్రిప్
జనవరి నుంచి కొత్తగా ఆన్లైన్ కార్డ్ చెల్లింపు వ్యవస్థ
యుద్ధానికి సన్నద్ధమవుతున్న చైనా.. 252 పేజీల అమెరికా డాక్యుమెంట్
జో బైడెన్‌కు తగ్గిన ప్రజాదరణ.. ఎందుకంటే..?
Star Trek : స్టార్ ట్రెక్ సిరీస్‌కు 55 ఏండ్లు
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..