బుధవారం 27 మే 2020
International - Apr 13, 2020 , 20:23:11

అప్పుల్లో ఉన్నాం క‌నిక‌రించండి: ప్ర‌పంచ దేశాల‌కు ఇమ్రాన్ మొర‌

అప్పుల్లో ఉన్నాం క‌నిక‌రించండి: ప్ర‌పంచ దేశాల‌కు ఇమ్రాన్ మొర‌

ఇస్లామాబాద్‌: క‌రోనాతో త‌మ దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ చిన్నాభిన్నామైంద‌ని పాకిస్తాన్ ప్ర‌ధాని ఇమ్రాన్‌ఖాన్ ప్ర‌పంచ‌దేశాల‌కు మొర‌పెట్టుకుంటున్నాడు. లాక్‌డౌన్ విధించినందుకు త‌మ దేశం ఆర్థికంగా అత్యంత‌ దారుణ ప‌రిస్థితుల‌ను ఎదుర్కొంటుంద‌ని వాపోయాడు. అప్పుల భారం నుంచి త‌మ‌ను కాపాడాల‌ని ప్ర‌పంచ‌దేశాల‌తో పాటు, అంత‌ర్జాతీయ ద్ర‌వ్య సంస్థ‌ల‌ను వేడుకొన్నాడు. మా దేశానికి మీరే దిక్కు అని చేతులెత్తి మొక్కినంత ప‌ని చేశాడు. 

ఆరోగ్యం, సామాజిక రంగాల్లో  తగినంతగా ఖర్చు పెట్టలేని స్థితిలో ఉన్నామ‌ని, రుణ మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశాడు. ఇప్పటికే లాక్ డౌన్ల కారణంగా మా దేశం తీవ్ర ఆర్ధిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోందని... అనేకమంది నిరుద్యోగులుగా మారార‌ని చెప్పుకొచ్చాడు. పరిశ్రమలు మూతబడ్డాయి. ప్రజలు ఆకలి చావులకు గురయ్యే ప్రమాదం ఉందని ఇమ్రాన్ ఖాన్ ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. పాక్ లో 5,183 కరోనా కేసులు నమోదు కాగా.. సుమారు 90 మంది కరోనా  రోగులు మృతి చెందారు.  ఈ నేప‌థ్యంలో కరోనా రాకాసిని ఎదుర్కోవడానికి తమకు తగినన్నినిధులను మంజూరు చేయాలనీ, తమను ఆదుకోవాలని ఇమ్రాన్ ఖాన్ అభ్యర్థించారు.


logo