బుధవారం 27 మే 2020
International - Apr 27, 2020 , 12:19:30

ఇమామ్‌కు కరోనా పాజిటివ్‌.. ప్రార్థనల్లో పాల్గొన్నవారికి కూడా!

ఇమామ్‌కు కరోనా పాజిటివ్‌.. ప్రార్థనల్లో పాల్గొన్నవారికి కూడా!

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్‌లోని మగురా జిల్లాలో ఓ ఇమామ్‌కు కరోనా వైరస్‌ సోకింది. శనివారం సాయంత్రం సుమారు 25 మందితో కలిసి ఆయన రంజాన్‌ ప్రార్థనలు నిర్వహించారు. ఆదివారం ఉదయం ఆయన అనారోగ్యం పాలవడంతో కరోనా పరీక్షలు నిర్వహించారు. అందులో ఆ ఇమామ్‌కు కరోనా పాజిటివ్‌ అని తేలింది. దీంతో ఆ ప్రార్థనల్లో పాల్గొన్న అందరికి పరీక్షలు నిర్వహించారు. వారి నుంచి నమూనాలు సేకరించిన ఆరోగ్య కార్యకర్తల నుంచి నమూనాలను సేకరించి, వారందరిని స్వీయ నిర్బంధంలో ఉండాలని అధికారులు సూచించారు.

బంగ్లాదేశ్‌లో ఇప్పటివరకు 5416 కరోనా కేసులు నమోదవగా, 145 మంది మరణించారు. దేశ రాజధాని ఢాకాలో ఉన్న ఇస్కాన్‌ టెంపుల్‌లో  31 కరోనా కేసులు నమోదయ్యాయి.


logo