సోమవారం 13 జూలై 2020
International - May 31, 2020 , 19:10:22

నిన్న ఆందోళనకు దిగారా? ఇవాళ కరోనా పరీక్ష చేయించుకోండి!

నిన్న ఆందోళనకు దిగారా? ఇవాళ కరోనా పరీక్ష చేయించుకోండి!

న్యూయార్క్‌: కరోనా వైరస్‌ విలయతాండవంతో మరణాల్లోనూ అగ్రస్థానంలో నిలిచిన అమెరికాకు.. నల్లజాతీయుడి హత్యతో ఆందోళనలు, విధ్వంసాలతో అట్టుడికిపోతున్నది. జార్జ్‌ ఫ్లాయిడ్‌ చనిపోయేందుకు కారకులైన మిన్నపొలిస్‌ పోలీసులపై తగు చర్యలు తీసుకోవాలంటూ గత మూడు రోజులుగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో అట్లాంటా మేయర్‌ కీషా లాన్స్‌ బాటమ్స్‌ ఆందోళనాకారులకు కరోనా వైరస్‌కు సంబంధించిన హెచ్చరిక చేశాడు. నిన్నటి ఆందోళనలో మీరు పాల్గొన్నట్లయితే తప్పనిసరిగా ఇవాళ కరోనా నిర్దారణ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉన్నదని ఆయన సూచించారు. అమెరికాలో ఇంకా కరోనా మహమ్మారి ఉన్నదని, అది తెల్లవాళ్లను, నల్లవాళ్లను పెద్ద సంఖ్యలో పొట్టన పెట్టుకొంటున్నదని విచారం వ్యక్తం చేశారు. ఎలాంటి నిబంధనలు పాటించకుండా ఇలాగే ఆందోళనలకు దిగితే కొవిడ్‌-19 కేసుల సంఖ్య రెండింతలు అయ్యే అవకాశాలు ఉంటాయని ఆయన హెచ్చరిస్తున్నారు. 

నల్లజాతీయుడు జార్జ్‌ ఫ్లాయిడ్‌ హత్యతో అమెరికాలో ఆందోళనలు మిన్నపొలిస్‌ నుంచి న్యూయార్క్‌ వరకు.. ఇటు అట్లాంటా నుంచి లాస్‌ఏంజెల్స్‌ వరకు ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొన్నిప్రాంతాల్లో నిరసనలు తీవ్రమవడంతో పలు ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్తులు ధ్వంసమయ్యాయి. ఈ సందర్భంగా ఆందోళనాకారులు ఎలాంటి నిబంధనలు పాటించకుండా నిరసనకు దిగడంతో సైలెంట్‌గా ఉన్న కరోనా వైరస్‌ విజృంభించే అవకాశాలు ఉన్నాయని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే అమెరికావ్యాప్తంగా 17 లక్షల మంది కరోనా వైరస్‌కు గురవగా.. లక్షా నాలుగు వేల మందికిపైగా చనిపోయారు. 


logo