శనివారం 30 మే 2020
International - Apr 03, 2020 , 19:26:37

సోష‌ల్ డిస్టెన్స్‌ పాటించకుంటే... 5000 డాలర్లు జరిమానా

సోష‌ల్ డిస్టెన్స్‌ పాటించకుంటే... 5000 డాలర్లు జరిమానా

క‌రోనా నియంత్ర‌ణ‌కు కెన‌డా ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకుంది.  ప్ర‌భుత్వ ఆదేశాల‌ను పాటించని వారికి భారీ జ‌రిమానా విధించ‌నుంది. సామజిక దూరం పాటించకుంటే 5000 కెనడా డాలర్ల ఫైన్ విధించాలని ఆదేశాలు జారీ చేసింది.  ఇందులో ఎలాంటి సడలింపులు ఉండవని, దూరం పాటించకుంటే జరిమానా కట్టక తప్పదని కెనడా ప్రభుత్వం హెచ్చ‌రించింది.  కరోనా వైరస్ రోజు రోజుకు విజృంభిస్తున్న తరుణంలో ప్రతి దేశం కూడా సామాజిక దూరం పాటిస్తోంది.  సామాజిక దూరం పాటిస్తేనే వైరస్ ను కట్టడి చెయ్యొచ్చు అన్నది ప్రభుత్వం యొక్క ఉద్దేశ్యం.  అయినా కూడా ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా..ప్ర‌జ‌లు చాలా చోట్ల వీటిని ఉల్లంఘిస్తూనే ఉన్నారు.  సామాజిక దూరం పాటించాలి, ఇద్దరు కలిసి ఉన్నప్పుడు కనీసం ఆరు అడుగుల దూరం ఉండాలని  ఎంత మొత్తుకొని చెప్తున్నా వినడం లేదు.  అందుకే కెనడా ప్రభుత్వం జ‌రిమాన వేయాల‌ని నిర్ణ‌యంచింది.logo