శనివారం 23 జనవరి 2021
International - Dec 11, 2020 , 01:59:27

అలర్జీ ఉంటే.. ఫైజర్‌ టీకా వద్దు

అలర్జీ ఉంటే.. ఫైజర్‌ టీకా వద్దు

లండన్‌: అలర్జీ సమస్యతో బాధపడుతున్నవాళ్లు ఫైజర్‌ టీకాకు దూరంగా ఉండాలని బ్రిటన్‌ సూచించింది. కరోనాకు అడ్డుకట్టవేయడంలో భాగంగా ఇటీవల బ్రిటన్‌లో ప్రజలకు టీకా కార్యక్రమాన్ని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కొందరికి అలర్జీ సమస్య తలెత్తినట్టు నివేదికలు వచ్చాయి. దీనిపై బ్రిటన్‌ హెల్త్‌కేర్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ స్పందించింది. గతంలో ఏదైనా టీకా తీసుకున్నా, ఔషధాలు వాడినా, ఆహారం తిన్నా అలర్జీ తలెత్తిన అనుభవం ఉన్నవాళ్లు ఫైజర్‌ టీకాను వేయించుకోవద్దని సూచించింది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొనే ఈ సూచన చేస్తున్నట్లు తెలిపింది. మరోవైపు టీకాను అభివృద్ధి చేసిన ఫైజర్‌-బయోఎన్‌టెక్‌ సంస్థలు స్పందిస్తూ అలర్జీ సమస్యపై హెల్త్‌కేర్‌ రెగ్యులేటరీ ఏజెన్సీ చేపట్టే దర్యాప్తునకు సహకరిస్తామని తెలిపాయి.logo