బుధవారం 21 అక్టోబర్ 2020
International - Sep 25, 2020 , 15:07:55

యాసిడ్ దాడికి ఇక‌పై జీవితఖైదు!

యాసిడ్ దాడికి ఇక‌పై జీవితఖైదు!

ఖాట్మండు: నేపాల్‌లో ఈ మ‌ధ్య త‌ర‌చుగా యాసిడ్ దాడులు జ‌రుగుతుండ‌టంతో ఆ దాడుల‌కు అడ్డుక‌ట్ట వేయ‌డం కోసం ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం తీసుకున్న‌ది. యాసిడ్ దాడుల‌కు పాల్ప‌డే వారికి ఇక నుంచి క‌ఠిన శిక్ష‌లు అమ‌లు చేయ‌నున్న‌ట్లు తెలిపింది. యాసిడ్ దాడిలో ఒక వ్య‌క్తి చ‌నిపోతే నేరస్థుడికి జీవిత‌ఖైదు ప‌డుతుంద‌ని నేపాల్ న్యాయ‌శాఖ మంత్రి శివ మాయ తుంబ‌హంఫే చెప్పారు. ఒక‌వేళ యాసిడ్ దాడిలో బాధితుడు లేదా బాధితురాలికి గాయాలైనా, శ‌రీరంలో ఏదో ఒక భాగాన్ని కోల్పోయినా 20 ఏండ్ల జైలుశిక్ష‌తోపాటు, ఒక మిలియ‌న్ నేపాలీ రూపాయ‌ల వ‌ర‌కు జ‌రిమానా చెల్లించాల్సి ఉంటుంద‌ని ఆయ‌న తెలిపారు.     

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo