బుధవారం 25 నవంబర్ 2020
International - Nov 14, 2020 , 12:43:09

న్యూయార్క్‌ ఎంపైర్‌ స్టేట్‌ భవనానికి దివాళీ శోభ..

న్యూయార్క్‌ ఎంపైర్‌ స్టేట్‌ భవనానికి దివాళీ శోభ..

న్యూయార్క్: అమెరికా రాష్ట్రంలోని న్యూయార్క్‌ ఎంపైర్‌ స్టేట్‌ భవనం దీపావళి శోభను సంతరించుకుంది. రంగురంగుల లైట్లతో తళుకులీనింది. వెలుగు దివ్వెల పండుగకు వేదికగా మారింది. ఆరెంజ్‌ కలర్‌లో మెరిసిపోయింది. హిందూ పండుగకు అత్యంత ప్రాధాన్యతినిచ్చి మతసామరస్యానికి ప్రతీకగా నిలిచింది. 

న్యూయార్క్, న్యూజెర్సీ, కనెక్టికట్ త్రిరాష్ట్ర ప్రాంతానికి చెందిన ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ అసోసియేషన్స్ (ఎఫ్‌ఐఏ), యూఎస్‌లోని ప్రముఖ సంస్థ, ఎంపైర్ స్టేట్ బిల్డింగ్‌ భాగస్వామ్యంతో ఐకానిక్ మాన్హాటన్ భవనాన్ని రంగురంగుల లైట్లతో అలంకరించారు. అలాగే, దీపావళిని పురస్కరించుకొని  ‘దీపావళి సూప్ & కిచెన్’ చొరవతో  ఆ మూడు రాష్ట్రాల్లో  10,000 మందికి భారతీయ సంప్రదాయ భోజనంతో విందు ఏర్పాటు చేసినట్లు ఎఫ్ఐఏ తెలిపింది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.