గురువారం 28 మే 2020
International - Apr 25, 2020 , 07:57:51

మా కిట్లకు ఐసీఎంఆర్‌ ఆమోదం ఉంది

మా కిట్లకు ఐసీఎంఆర్‌ ఆమోదం ఉంది

బీజింగ్‌: చైనా నుంచి వచ్చిన టెస్ట్‌ కిట్లలో లోపాలున్నట్లు ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో వాటిని రెండు రోజులపాటు ఉపయోగించవద్దని ఇటీవల ఐసీఎంఆర్‌ రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ కిట్లకు ఐసీఎంఆర్‌ ఆమోదం ఉందని, అవి సరిగానే పనిచేస్తున్నాయని, ఉపయోగించడంలోనే లోపం ఉన్నదని ర్యాపిడ్‌ యాంటీబాడీ కిట్లను సరఫరా చేసిన చైనా కంపెనీలు వాండ్‌ఫో, లివ్‌జాన్‌ డయాగ్నస్టిక్స్‌ ప్రకటించాయి. దర్యాప్తునకు సహకరిస్తామని వెల్లడించాయి. 


logo