సోమవారం 30 నవంబర్ 2020
International - Oct 24, 2020 , 21:06:33

‘ట్రంప్‌ అనే పేరున్న వ్యక్తికి ఓటు వేశా..’

‘ట్రంప్‌ అనే పేరున్న వ్యక్తికి ఓటు వేశా..’

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ శనివారం ముందస్తు బ్యాలెట్‌లో ఓటు వేశారు. నవంబర్‌ 3న జరుగనున్న అధ్యక్ష ఎన్నికల ప్రచారాన్ని ఆయన తీవ్రం చేశారు. ప్రత్యర్థి డెమొక్రాట్ పార్టీకి చెందిన జో బిడెన్‌ ప్రచారంతో వెనుకబడి ఉన్న ట్రంప్, ఫ్లోరిడాలోని వెస్ట్ పామ్ బీచ్‌లోని పోలింగ్ కేంద్రంగా ఉన్న లైబ్రరీలో ఓటు వేశారు. గత ఏడాది నూయార్క్‌ నుంచి ఫ్లోరిడాకు తన నివాసాన్ని ఆయన మార్చారు. ఈ నేపథ్యంలో ట్రంప్‌ ఇక్కడ ముందస్తు ఓటును వినియోగించుకున్నారు. అనంతరం బయటకు వచ్చిన తర్వాత.. ‘ట్రంప్‌ అనే పేరున్న వ్యక్తికి ఓటు వేశాను’ అని నవ్వుతూ అన్నారు.

సాధారణంగా మాస్కుకు దూరంగా ఉండే  ట్రంప్‌ దీనికి భిన్నంగా వ్యవహరించారు. మాస్కు ధరించి ఓటు వేశారు. ‘ఇది చాలా సురక్షితమైన ఓటు. మీరు బ్యాలెట్‌లో పంపినప్పుడు కంటే చాలా సురక్షితమని నేను మీకు చెప్పగలను’ అని ట్రంప్ అన్నారు. ఆధారాలు లేని మెయిల్-ఇన్ ఓటింగ్ మోసానికి దారితీస్తుందని ఆయన గట్టిగా చెబుతున్నారు. మరోవైపు కరోనా వైరస్‌ మహమ్మారి కారణంగా వ్యక్తిగతంగా ఓటు వేయడం సమస్యాత్మకంగా భావించిన సుమారు 5.5 కోట్ల మంది అమెరికా ప్రజలు ముందస్తుగా ఓటు వేశారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.